Search
Friday 21 September 2018
  • :
  • :

క్షేత్రపాలకుడికి ఆకు పూజలు

rice

మనతెలంగాణ/యాదాద్రి ః యాదగిరిగుట్ట దేవస్థానం శ్రీలక్ష్మీ నర సింహస్వామి ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి మంగళ వారం విశేషంగా ఆకుపూజ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వ హించారు. కొండపైన గల విష్ణు పుష్కరణి వద్ద గల శ్రీ ఆంజనే యస్వామి ఆల యంలో ఉదయం స్వామి వారికి సింధూర క్షేపనం నిర్వహించి లక్ష తమలపాకులతో నాగవల్లి దళార్చన జరిపి శాస్త్రో క్తంగా ఆకుపూజను నిర్వహించారు. పాతగుట్ట పుష్కరిణి వద్ద ఉన్న, కొండ కింద గల ఆల యాలలో వేరువేరుగా ఈ ఆకుపూజను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు
శ్రీ ఆంజనేయ ఆలయం వద్ద అన్నదానం
పట్టణ కేంద్రంలోని గణేష్‌నగర్‌లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం రోజున ఆలయ అభివృధ్ధి కమిటీ దాతల సహకారంతో అన్నదాన కార్య క్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీరామ్‌గౌడ్ తెలి పారు. ప్రతి మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఆల య కమిటీ సభ్యులు గడ్డమీది కృష్ణ, గుండ్లపల్లి లింగయ్య, అంకం మల్లే షం, గంధమల్ల ఉపేందర్, మచ్చ నర్సింహ్మ, బందారపు పెంటయ్య, కం సాని కృష్ణ, కొమ్మగాని నర్సింహ్మ, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

comments