Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

‘పది’ నిమిషాలలో ప్రశ్నపత్రం లీక్

10th

తాండూరులో మాస్ కాపీయింగ్
ర్యాంకింగ్ కోసం బడుల ఆరాటం

మన తెలంగాణ/తాండూరు (వికారాబాద్ జిల్లా): పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన రోజే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మాస్ కాపీయింగ్‌కు తెరలేచింది. పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలలోనే ప్రశ్నాపత్రం లీక్ అయింది. దీంతో విద్యార్థుల బంధువులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని చీటీలు అందించారు. పట్టణ సిఐ ప్రతాపలింగం రంగంలోకి దిగడంతో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పదవ తరగతి వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.గురువారం తెలుగు మొదటి పేపర్ ఉదయం 9:30 నిమిషాలకు విద్యార్థులకు అందించారు. పట్టణంలోని నెంబర్ 1 పరీక్ష కేంద్రం నుండి పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలలోనే ప్రశ్నాపత్రం వాట్సప్ ద్వారా లీక్ అయింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లితండ్రులు, బంధువులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని జవాబు చీటీలను విద్యార్థులకు అందించారు. మిగిలిన పరీక్షా కేంద్రాలకు సైతం వాట్సప్ ద్వారా ప్రశ్నా పత్రం చేరడంతో ప్రతి సెంటర్ వద్దకు జనం చేరుకున్నారు.
‘పది’ పరీక్ష రాసిన ఇంటర్ విద్యార్థులు
పదోతరగతి విద్యార్థులకు బదులుగా ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసి అడ్డంగా దొరికిన సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం, దొంగతుర్తి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. అదేవిధంగా ఖిలావనపర్తి మారుతి విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న కోల మహేష్, పెండ్యాల శ్రీనివాస్‌లకు దొంగతుర్తిలోని జడ్పీ పాఠశాలలో పరీక్ష రాయా ల్సి ఉండగా వారి స్థానంలో ఇంటర్ విద్యార్థులు మామిడి శెట్టి పవన్ కుమార్, సామంతుల హరీష్‌లు పరీక్షలు రాస్తుండగా అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు తనిఖీ చేయగా దొరికిపోయారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఎసిపి హబీబ్‌ఖాన్, సిఐ నరేందర్ విచారణ చేపట్టి ఐదుగురిపై కేసు నమోదు చేశారు. పది విద్యార్థులు మహేష్, పెండ్యాల శ్రీనివాస్ ఇంటర్ విద్యార్థులు మామిడి శెట్టి పవన్‌కుమార్, సామంతుల హరీష్, మారుతి విద్యాలయం కరస్పాండెంట్ కొమురయ్యపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిపి హబీబ్ ఖాన్ తెలిపారు.
ఇంట్లో తండ్రి శవం.. పరీక్షా హాల్లో తనయుడు
మన తెలంగాణ/యాలాల : కన్న తండ్రి చనిపోయినా తనయుడు పదవ తరగతి పరీక్షకు హాజరైన సంఘటన మం డల పరిధిలో నాగసముందర్ లో గురువారం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా, యాలాల మండలం, నాగసముందర్‌కి చెందిన మోహన్‌రెడ్డి గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. మృతుడు మోహన్‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి మండల పరిధిలోని పగిడియాల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు.తండ్రి శవం ఇంట్లో ఉన్నా పుట్టెడు దుఖఃంలో మొదటి రోజు తెలుగు పేపర్1 రాయడానికి పరీక్షా కేంద్రం అగ్గనూర్ ఉన్నత పాఠశాలకు హాజరై పరీక్షను రాశాడు.

Comments

comments