Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ప్లాస్టిక్ కవర్ నిషేదంపై చట్ట పరంగా చర్యలు

Monetary-document-image

కల్వకుర్తి: పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వాడకంతో పర్యావరణం కలుషితో పాటు కొత్త రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్లాస్టిక్ రక్కసిని సమూలంగా నాశనం చేసేందుకు చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని మంగళవారం స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో ఎస్‌ఐ రవికుమార్‌కు బృందం సభ్యులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మనిష్ మాట్లాడుతూ… గతంలో ప్లాస్టిక్ కవర్ నిషేధంపై బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరోసారి చెట్ల పెంపకం, ప్లాస్టిక్ నిషేదం, తమతో పాటు చట్ట పరంగా ప్లాస్టిక్ నిషేదంపై చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందనే ఆశతో పోలీస్‌ స్టేషన్‌లో వినతి పత్రం ఇచ్చినట్టు ఆయన తెలిపారు. దానికి ఎస్‌ఐ రవికుమార్ సానుకూలంగా స్పందించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిషేదం, వాడకంపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

Comments

comments