Home తాజా వార్తలు హాలీవుడ్ లెజండరీ రెనాల్డ్స్ ఇకలేరు

హాలీవుడ్ లెజండరీ రెనాల్డ్స్ ఇకలేరు

Hollywood-Actor

న్యూయార్క్:  హాలీవుడ్ లెజండరీ నటుడు, దర్శకుడు బుర్ట్ రెనాల్డ్స్ (82) శుక్రవారం ఫ్లోరిడాలో తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం బుర్ట్ కు  గుండెపోటు రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. బర్ట్ రెనాల్డ్స్ హాలీవుడ్ మోస్ట్ పాపులర్ నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  1970 లో భారీ బాక్స్ ఆఫీస్ ఆకర్షణగా నిలిచిన బర్ట్ రెనాల్డ్స్, డెలివరెన్స్,  బూగీ నైట్స్‌ మూవీలలో అద్భుతంగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన నటించిన లాంగెస్ట్ యార్డ్, బూగీ నైట్స్, స్మోకీ అండ్ ది బాండిట్‌ లాంటి సినిమాలు  భారీ విజయాలను తెచ్చిపెట్టడంతో హాలీవుడ్ లో మంచి పేరు సంపాదించారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. రెనాల్డ్స్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.