Home తాజా వార్తలు అర్థవంతమైన చర్చలు జరిగేందుకు సభ్యులు సహకరించాలి: రమేష్

అర్థవంతమైన చర్చలు జరిగేందుకు సభ్యులు సహకరించాలి: రమేష్

Speaker-Ramesh

బెంగళూరు: ప్రజలకు ప్రజాప్రతినిధులు విధేయులుగా ఉండాలని శాసన సభ స్పీకర్ రమేష్ కుమార్ సూచించారు. శాసన సభలో ఆయన ప్రసంగించారు. స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాగద్వేషాలు లేకుండా సభను సజావుగా నడుపుతానని మీ నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలకు అభినందనలు తెలిపారు. శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు సభ్యులు సహకరించాలని కోరారు.