Search
Thursday 15 November 2018
  • :
  • :

లైకా నుంచి మరో డిజిటల్ కెమెరా…

leica c- lux compact camera release in india

ముంబయి: ప్రముఖ కెమెరాల తయారీదారు లైకా తన కొత్త డిజిటల్ కెమెరా సి-లక్స్‌ను సోమవారం భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.85వేల ధరకు ఈ కెమెరా ఆగష్టు చివరి వారం నుంచి వినిమోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ కెమెరాలో 20 మెగాపిక్సల్ సెన్సార్‌ను ఉంది. 15ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ అప్షన్ ఉంది. ఈ కెమెరాతో 4కె వీడియోలను 30ఎఫ్‌పిఎస్ రేటుతో, 1080పి వీడియోలను 60ఎఫ్‌పిఎస్ రేటుతో షూట్ చేసుకోవచ్చు. ఎఫ్/3.3, 6.4 వరకు కెమెరా అపర్చర్ లభిస్తోంది. బ్లూటూత్, వైఫై ఉండడంతో కెమెరాలో తీసిన ఫొటోలను సులభంగా వేరే డివైస్‌లకు ట్రాన్స్‌ఫర్ చేసుకోను సౌకర్యం కలదు. ఈ కెమెరాలో 3 ఇంచుల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, లైట్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియెంట్లలో ఈ కెమెరా ఇండియన్ మార్కెట్లో వచ్చింది.

Comments

comments