Home తాజా వార్తలు ఆరోగ్యానికి ‘నిమ్మ’ మేలు

ఆరోగ్యానికి ‘నిమ్మ’ మేలు

Lemonసూర్యాపేట కల్చరల్ : నిత్యం మన కళ్లముందు కన్పించే నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నిమ్మలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతి రోజు గ్లాసు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, పంచాదార కలుపుకొని తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. శుభ్రమైన నీటిని మరిగించి మనం తాగడానికి వీలైనంత వరకు చల్లార్చాలి. ఓ గ్లాసులో కాచిన నీటిలో నిమ్మకాయ రసం పిండాలి. ఈ ద్రవంలో పంచాదార తీపి పదార్ధాలు కలపకుండా పరిగడుపున తాగాలి. గంట తర్వాత బ్రేకు పాస్ట్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్య పరంగా పలు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కాలేయం శుభ్రపర్చడంతో పాటు పనితీరు మెరుగుపడుతుంది. మరిన్ని ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్దకం తగ్గిపోతుంది. నిమ్మరసం రక్తంలో త్వరగా కలిసిపోయి అన్ని అవయవాలు చురుకుగా పనిచేస్తాయి. భోజనానికి ముందు నిమ్మరసం తాగడం ద్వారా పిహెచ్ స్థాయి పెరుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. నిమ్మరసం యూరిక్ యాసిడ్‌ను పలుచన చేసి కీళ్ల నొప్పులు, గెట్స్ వంటి రుగ్మతల బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది. నోటిలో బాగా లాలాజలం ఊరుతుంది. శరీరంలో తాపాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. నిమ్మరసంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. సోడియంతో కలిసి మెదడు నాడీ వ్యవస్థల పనితీరును మెరుగు పరుస్తుంది. రక్తంలో నిమ్మ రసం వల్ల కాలుష్యం, మెగ్నీషియం నిల్వలు సమృద్ధిగా ఏర్పడతాయి. తగినంత కాలుష్యం ఉండడం వలన రికెట్స్ వ్యాధి సోకే అవకాశం ఉండదు. మెగ్నీషియం గుండెకు చాలా మంచిది. నిమ్మరసం తాగితే పై విధంగా ఉపయోగాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Lemon is Good for Health