Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఫ్లిప్‌కార్ట్‌లో లెనోవో ఫెస్టివల్ ఆఫర్లు

Lenovoన్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా లెనోవో మొబైల్ ఫెస్ట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌పై లెనోవో మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ బ్రాండ్‌కు చెందిన పాత మొబైల్ ఫోన్లను మార్చుకొనే సదుపాయాన్ని కూడా కల్పించింది. ఈ ఆఫర్ సోమవారం నుంచి ఈ నెల 28 వరకు అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ స్పష్టంచేసింది. ఈ ఆఫర్ల ప్రకారం లెనోవో కె6 పవర్ 3 జిబి ర్యామ్ మోడల్ 8,999లకే లభించనున్నాయి. 4 జిబి ర్యామ్ కల్గిన ఫోన్ 9999లకు లభించనుంది. ఈ రెండింటిపై సుమారు రూ.వెయ్యి తగ్గింపు ప్రకటించింది. వీటికి తోడు ఫ్లిప్‌కార్ట్ కూడా ఎక్స్ఛేంజ్ కింద ఫోన్లపై రూ.8500 వరకు ఆఫర్‌ను ఇస్తున్నట్టు ప్రకటించింది. అలాగే 4 జిబి రామ్ కల్గిన లెనోవో వైబ్ 5కె నోట్ ఫోన్ 10,499కే లభిస్తోంది. 3 జిబి రామ్ కల్గిన ఫోన్ 9999లకే రానుంది. ఇంకా పలు లెనోవో మోడల్ ఫోన్లపై ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

Comments

comments