Search
Friday 16 November 2018
  • :
  • :

లెనోవో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ‘జడ్5’

Lenovo Launches New Smartphone Z5 With Snapdragon 636ఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు లెనోవో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్5’ ను మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా, వినియోగదారులకు జూన్ 12వ తేదీ నుంచి ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిథులు తెలిపారు. ఈ ఫోన్‌లో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేతో పాటు ఆకట్టుకునే రంగులతో ప్రీమియం లుక్ వచ్చేలా అద్భుతంగా డిజైన్ చేశారు. అరోరా బ్లూ, బ్లాక్, ఇండిగో బ్లూ కలర్ వేరియెంట్లలో ఫోన్ ను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచారు. అంతేగాక దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కూడా కల్పించారు. 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.14,670గా, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్  ధరను రూ.18,870గా కంపెనీ నిర్ణయించింది.

లెనోవో ‘జడ్5’ ఫీచర్లు…

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ తాకెతెర(2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్)

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్

6 జిబి ర్యామ్, 64/128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్(256 జిబిల వరకు విస్తరించుకునే సదుపాయం)

16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

4జి విఒఎల్‌టిఇ

డ్యుయల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 5.0

యుఎస్‌బి టైప్ సి

ఫింగర్‌ప్రింట్ సెన్సార్

3300 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

ఫేస్ అన్‌లాక్ సదుపాయం

Comments

comments