Home జాతీయ వార్తలు మొండి బకాయిలపై ప్రభుత్వ బ్యాంకుల కొరడా

మొండి బకాయిలపై ప్రభుత్వ బ్యాంకుల కొరడా

Govt-Banksఉద్దేశపూర్వక ఎగవేతదారులపై 1,624 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
రూ.16,601.90 కోట్లకు ఎగనామం, చర్యలు తీసుకోవడంలో ఎస్‌బిఐ అలసత్వం, దూకుడుగా కెనరాబ్యాంకు

న్యూఢిల్లీ: ప్రభుత్వం, ఆర్‌బిఐ ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రభుత్వ బ్యాంకులు మొండి బకాయిలపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పై దాదాపు 1,624 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 ముగింపు నాటికి మొత్తం ఉద్దే శపూర్వక ఎగవేతదారుల సంఖ్య 7,265గా ఉంది. వీటి లో 22 శాతం ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశామని ప్రభు త్వం బ్యాంకులు ప్రకటించాయి. ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన 1,624 కేసులు రూ.16,601.90 కోట్లకు ఎగనామం పె ట్టాయని బ్యాంకులు తెలిపాయి. దీనికి గాను వీరిని ఉద్దేశ పూర్వక ఎగవేతదారులుగా ముద్రవేసి, కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొత్తం ఉద్దేశపూర్వక ఎగ వేతదారులు మొత్తంగా రూ.64,334.59 కోట్లకు ఎగనామం పెట్టారు. ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడంలో ఎస్‌బిఐ నెమ్మదిగా ఉంది. ఈ బ్యాంకు 13 ఎగవేతదారుల కేసులు నమోదు చేయగా, వీటి విలువ రూ.13.10 కోట్లుగా ఉంది.

అయితే ఈ బ్యాంకులో 1,164 ఎగవేత కేసులు ఉండగా, వీటి విలువ రూ.11,705 కోట్లుగా ఉంది. ఈ గణాంకాల్లో కెనరా బ్యాంకు 225 ఎగవేత(రూ.1,031 కోట్లు) ఎఫ్‌ఐఆర్‌ల తో ముందు వరుసలో నిలిచింది. బెంగళూరుకు చెందిన ఈ బ్యాంకులో మొత్తం 480 ఎగవేత కేసులు ఉండగా, వీటి విలువ రూ.3,209 కోట్లుగా ఉంది. ఇంకా కార్పొ రేషన్ బ్యాంక్ 4 ఎఫ్‌ఆఆర్‌లను నమోదు చేయగా, వీటి విలువ రూ.11.40 కోట్లుగా ఉంది. ఈ బ్యాంకు 126 ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా వీటి విలువ రూ.2,356.98 కోట్లుగా ఉంది. ఆ తర్వాత ఐడిబిఐ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై 5 కేసులు నమోదు చేసింది. వీటి విలువ రూ.332.76 కోట్లుగా ఉంది. ఈ బ్యాంకు 70 మంది ఎగవేతదారు ల(రూ.1,982.80 కోట్లు)ను గుర్తించింది. ప్రభుత్వం బ్యాంకులు 20 శాతం స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) ను కలిగి ఉన్నాయి.ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి ప్ర భుత్వం బ్యాంకుల స్థూల ఎన్‌పిఎ రూ.3.14 లక్షల కోట్లుగా ఉంది. ఈనెల 1న ఐదో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు(ఎన్‌పిఎ) పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

బ్యాంకు తమతమ బ్యాలెన్స్ షీట్లను క్లియల్ చేసుకోవాలని సూచించారు. ఇందుకు గాను సెంట్రల్ బ్యాంక్, ప్రభుత్వం సహకారం అందిస్తా యని అన్నారు. బ్యాంకులకు సర్వాధికారాలు ఉన్నాయ ని, మొండి బకాయిలు పరిష్కరించుకునేందుకు వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. స్థూల ఎన్‌పిఎ 6 శా తం దాటడంపై రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పిఎ 2015 మార్చిలో 5.20 శాతం నుంచి జూన్ నెలలో 6.03 శాతానికి పెరిగింది. 2015 సెప్టెంబర్ నాటికి మొత్తం మొండి బకాయిలు, పునర్వవస్థీకరించిన ఖాతాలు 10.7 శాతంగా ఉన్నాయ ని, వచ్చే మార్చి నాటికి ఇది 10.3 శాతం వద్ద ఉంటుంద ని దేశీయ రేటింగ్ సంస్థ ఐసిఆర్‌ఎ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి బ్యాంకులు నిరర్థక ఆస్తుల సమస్యల ను పరిష్కరించుకోవాలని, మొండి బకాయిలను పరిష్క రించుకుంటారని ఆశిస్తున్నామని రాజన్ పేర్కొన్నారు. ఎన్‌పిఎలను వదిలించుకుని పరిశుద్ధం అయ్యేందుకు బ్యాంకులు అధికారాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ సమస్య పరిష్కారం కోసం త్వరలో బ్యాంకుల మెరుగైన పనితీరును చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.