Home తాజా వార్తలు తాగిన మత్తులో ఆస్కార్‌ని మర్చిపోయాడు…?

తాగిన మత్తులో ఆస్కార్‌ని మర్చిపోయాడు…?

leonardo-oscar-award-wing-i23 ఏళ్ల నిరీక్షణ తర్వాత లియోనార్డో 88వ అస్కార్ ప్రధానోత్సవంలో ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. ఐదు నామినేషన్లు పొందినా రాని ఆస్కార్ పురస్కారం.. ‘రెవెనంట్‌’లో నటనకుగాను ఆరో నామినేషన్‌తో డికాప్రియోను వరించింది. అయితే అస్కార్ అందుకోవడం లియోకి అంతా ఇంతా ఆనందాన్ని ఇవ్వలేదు. తన స్నేహితులతో కలిసి హాలీవుడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో లియో పెద్ద ఎత్తున పార్టీ చేసుకున్నాడు. అయితే ఈ పార్టీకి సంబంధించిన ఓ వీడియోని టిఎంజెడ్ డాట్‌కామ్ విడుదల చేసింది. ఈ వీడియో ప్రకారం తన స్నేహితులతో పార్టీ చేసుకున్న లియో మందుతో పాటుఎలక్ట్రిక్ సిగార్‌తో ధూమపానం కూడా చేశారు. అయితే రెస్టారెంట్‌లో జరిగిన పార్టీ తర్వాత లియో ఆ మత్తులో ఆస్కార్‌ను అక్కడే వదిలేసినట్లు వీడియోలో తెలుస్తుంది. రెస్టారెంట్‌లో నుంచి నిదానంగా నడుచుకుంటూ వచ్చి తన కారు ఎక్కిన ఆయనకు ఆ తర్వాత కాసేపటికి వచ్చిన ఓ వ్యక్తి  బ్యాటిల్ అందించగా, మరో వ్యక్తి వచ్చి బంగారు ఆస్కార్ బొమ్మను అందించాడు.