Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

భయాందోళనకు గురి చేస్తున్న చిరుత

Leopard-Agraఆగ్రా : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో చిరుతపులి కలకలం రేపింది. ఓ ఏరియాలోకి చొరబడి స్థానికులు, అధికారులను భయాందోళనకు గురి చేస్తుంది. సురేశ్ నగర్‌లోకి చొరబడిన చిరుతపులి ఖాళీ ప్రదేశంలో నక్కింది. తర్వాత ఖాళీగా ఉన్న ఇంట్లోకి దూరింది. ఈ క్రమంలో పలువురిపై దాడి చేసింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులి దాక్కున్న చోటకు చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులతో పాటు డాక్టర్లు, వన్య మృగాల పరిరక్షణ ఎన్జీవో ప్రతినిధులు చిరుతపులి కదలికలను గమనిస్తున్నారు. దాన్ని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Comments

comments