Search
Friday 21 September 2018
  • :
  • :

వంట గదిలో చిరుత

LEOPARD

పుణె : ఉదయాన్నే వంట చేసేందుకు వంట గదిలోకి వెళ్లిన వంట మనిషి అక్కడ కనిపించిన చిరుతను చూసి భయకంపితుడయ్యాడు. ముందుగా అది పిల్లి అని భ్రమించాడు. ఈ క్రమంలోనే దాన్ని అదిలించాడు. అది చిరుత అని తెలియడంతో వంట గది నుంచి బయటకు పరుగుపెట్టాడు. పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐబిఎం)లోని వంట గదిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అప్రమత్తమైన సిబ్బంది వంట గదికి తాళాలు వేసి అటవీశాఖ అధకారులకు సమాచారమిచ్చారు. వారొచ్చి ఆ చిరుతకు మత్తు మందు ఇచ్చేందుకు యత్నించారు. నాలుగు గంటల పాటు శ్రమించిన అధికారులు దాన్ని బంధించి రాజీవ్ జూలాజికల్ పార్క్‌కు తరలించారు. అనంతరం చిరుతను చాందవలీ అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Comments

comments