Home సంగారెడ్డి చిరుత పులి కళేబరం లభ్యం..

చిరుత పులి కళేబరం లభ్యం..

 Leopard tiger carpets are available in Singur Project
పుల్‌కల్: మండలంలోని పెద్దారెడ్డిపేట శివారు సింగూర్ రిజర్వాయర్ తీర ప్రంతంలో మృతి చేందిన చిరుతపులి కళేబరం లభ్యమైంది. మృతి చెందిన చిరుతపులిని పెద్దారేడ్డిపేట యువకులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిచారు. సింగూర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలోని కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహంలో చిరుతపులి కళేబరం కోట్టుకురావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సమాచారం తెలుకున్న స్థానికులు భారీ సంఖ్యలో సింగూర్ బ్యాక్ వాటర్ వద్దకు చేరుకోని ఆసక్తిగా తిలకించారు. కర్నాటక, మహారాష్ట అడవులలో వరదలకు చిక్కుకొని మృతి చెంది ఉంటుందని అటవీ శాఖ అధికారులు పేర్కోంటున్నారు. అటవీ శాఖ అధికారులు మృతి చెందిన చిరుతపులి కళేబరాన్ని స్వాదినం చేసుకున్నారు. చిరుత పులి ఎలా మృతి చెందిందని అరా తీస్తున్నారు.