Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

క్షణ క్షణం.. భయం భయం

* చిరుత సంచారం తో భయాందోళనలో రైతులు
* చిరుత దాడిలో మృతి చెందుతున్న మూగజీవాలు
* పట్టించుకోని అటవీశాఖ అధికారులు

Leopard-attack-on-Anima

కోడేరు : మండలంలో చిరుత సంచారంతో ప్రజలు, రైతులు భ యాందోళనకు గురౌతున్నారు. తమ కష్టంలో సగబాగం పంచుకుంటున్న పెంపుడు జంతువులను చంపితింటుంది. పొలాల్లో కాపలా వెళ్లాలంటే రైతులు భయప డుతున్నారు. రైతుపై దాడి సంఘటనలో తృట్టిలో ప్రాణాపాయం తప్పింది. అరచేతి లో ప్రాణాలు పెట్టుకొని తమ పంటలు కాపాడుకుంటున్నారు రైతులు. మండలం లో చిరుత దాడిలో మృతి చెందిన మూగజీవాలు ఇన్నిఅన్ని కావు . నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్న అటవిశాఖ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

మండలంలో గత ఆరు నెలలుగా చిరుత సంచారంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. గొర్రెల మందపై, పశువుల పాకలపై దాడిచేసి చంపి వేస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందొ ఎటువైపునుంచి చిరుత దాడి చేస్తుందో అర్థకాక రైతులు క్షణ క్షణం భయాందోళనకు గురౌతున్నారు. వ్యవసాయ పొలాల వద్ద పశువులతో పాటు తమ పంట పొలాలకు కాపలా ఉండే రైతులు భయంతోనే కాలం వెల్లదీస్తున్నారు. పొలాల్లో ఆపుకు నే గొర్రెల మందలపై దాడి చేసి గొర్రెలను చంపి వే స్తుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పశువు లు, గొర్రెలు పారిపొతున్నాయి. వీటిలో కొన్ని దొరక గా మరికొన్ని దొరకక పొవడంతో రైతులు, గొర్రెల కాపరులు తీవ్రంగా నష్ట పొతున్నారు. పంట పొలా లకు కాపలా వెళ్లలేక అడవి పందుల బారి నుంచి తమ పంటలను కాపాడుకొలేక నష్టపొతున్నారు.

చిరుత దాడి సంఘటనలు ఇవి :

మండలంలోని కోడేరు శివారులో పులి గుట్ట వద్ద పశువుల పాకపై జూలై 7న దాడి చేసి ఆవు దూడను చంపి కిలోమీటర్ దూరంలోని ఎత్తం గట్టు పైకి తీసుకెళ్లి తిన్నది.

జూలై 17న నాగులపల్లి శివారులో వ్యవసాయ పొలంలో ఆగివున్న గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. ఈ సంఘటనలో ఒక మేక మృతి చెందగా మరి కొన్ని గొర్రెలు పారిపొయాయి.

ఆగస్టు 16న కోడేరు శివారులో గొర్రెల మందపై దాడి చేసింది. ఒక గొర్రెను చంపి వేసింది.

ఆగస్టు 16న పన్పుల శివారులోని గుడ్ల గట్టు వద్ద పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్‌కు చెంది న గొర్రెల మందపై దాడి చేసి రెండు గొర్రెలు చం పింది.

సెప్టెంబర్ 13న కోడేరు మండలం ఎత్తం శివారు మబ్బు గుట్ట వద్ద ఆగి వున్న గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను చంపింది.

సెప్టెంబర్ 21న ఖానాపూర్ శివారులో గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను చంపి తింది.

పస్పుల శివారులో నిళ్లు తెచ్చుకునేందుకు బోరు వద్దకు వెళ్లిన యువకులకు చిరుత పులులు నీళ్లు తాగుతూ కనిపించాయి
అక్టొబర్ 30న పస్పుల శివారులోని బొడగుట్ట సమీపంలో పశువుల పాకపై దాడి చేసి నారాయ ణకు చెందిన లేగ దూడను చంపింది .
పస్పులకు చెందిన చెన్నయ్య వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా మాటు వేసిన చిరుత దాడి చేసిం ది. ఆ సమయంలో అలజడి రావడంతో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. దీంతో తృట్టిలో ప్రమా దం తప్పింది.

డిసెంబంర్ 6న ఎత్తం గట్టు వద్ద రైతులు పెంచు కున్న మూడు గొర్రెలను చంపి ఒక దాన్ని తిన్నది .
రేకుల పల్లి శివారులో పశువుల పాకపై దాడి చేసింది .
జనవరి 31న ఎత్తం శివారులోని పశువుల పాక దాడి చేసి లేగ దూడను చంపింది.

దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురౌత న్నారు. పశువుల పాకలపై, గొర్రెల మందపై దాడి చేసి చంపుతుండడంతో వ్యవసాయ పనులు సైతం చేసుకొలేక పొతున్నామని రైతులు అంటున్నారు. పొలాల వద్ద ఉండే మూగ జీవాలకు రక్షణ కరు వైందని వాపొతున్నారు. ఇప్పటికైనా చిరుత బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కొరుతున్నారు. పొలాల్లో రక్షణ కరువైంది
-పర్వత్‌రెడ్డి రైతు

పంట పొలాలకు వెళ్లాలన్న భయంగా ఉంది . ఎప్పు డు చిరుత ఎక్కడి నుంచి దాడి చేస్తుందొ అని భయం తో పొలం పనులు చెసుకుంటున్నాం. అదికారులు మా గోడు పట్టించుకొవడం లేదు. ఇప్పటికైనా స్పం దించి చిరుత పులి పట్టుకుని రక్షణ కల్పించాలి.

మృతి చెందిన జీవాలకు నష్టపరిహరం ఇవ్వాలి:
ఆంజనేయులు రైతు, బాధితుడు
మృతి చెందిన జీవాలకు నష్టపరిహరం ఇవ్వాలి. ఇప్పటికైనా చిరుత పులి పట్టుకొని అటవి శాఖ అధి కారులు రక్షణ కల్పించాలి. -రైతు

Comments

comments