Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

భద్రాద్రిని మలేరియా రహిత జిల్లాగా మారుద్దాం

collectar-image

మన తెలంగాణ/భద్రాచలం: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషిచేయాలని ఐటిడిఎ పిఓ పమేలా సత్పథి ఆదేశించారు. శనివారం ఐటిడిఎ సమావేశంలో మలేరియా నిర్మూలించేందుకు గిరిజన గ్రామాలలో ఐఆర్‌యస్ స్ప్రేయింగ్ కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ సూపర్‌వైజర్స్, హెచ్‌ఇఓలు, యూనిట్ అధికారులు, మలేరియా టెక్నికల్ సూపర్‌వైజర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మలేరియా నియంత్రించేందుకు సంబంధి త సిబ్బంది దోమలమందు పిచికారీ చేసి, వివిధ వ స్తువులను, మలేరియా కిట్‌లను ఆమే పరిశీలించా రు. ఎడిఎం హెచ్‌ఓ సింగరాజుకు మలేరియా రక్త పరీక్ష నిర్వహించి, మలేరియా ఉన్నది, లేనిది పిఓ కి సిబ్బంది మలేరియా కిట్ పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  వ్యా ధుల కాలం ప్రారంభమైంది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, మలేరియా నిర్మూలనకు పిన్ పాయింట్ ప్రోగ్రాం అమలు చేయాల ని, డేటావైజ్, విలేజ్‌వైజ్, పాపులేషన్‌వైజ్ నివేధిక లు తయారు చేయాలని, 06 హ్యాబిటేషన్లలో మొద టి విడత స్ప్రేయింగ్ 100 శాతం పూర్తి చేయాలని, దోమల నివారణను ఫెస్టివల్‌గా నిర్వహించాలని, ప్రతీ గ్రామంలో స్ప్రే యింగ్ యాక్షన్ ప్లాన్‌పై ఆ యా మం డలాలప్రజా ప్రతినిధులను తెలియజే సి యస్‌హెచ్‌జి గ్రూపుల ద్వారా రేపే, మీ గ్రామంలో మలేరియా స్ప్రేయింగ్ జరుగుతుందని ముందుగా తెలియపర్చాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు హా జరయ్యే విధంగా చూడాలని ఈనెల 28వ తారీఖు వరకు మొదటి విడత స్ప్రేయింగ్ ప్రారంభించాల ని, ఐఆర్‌యస్ స్ప్రేయింగ్ కొరకు మలేరియా సి బ్బంది అందరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించటం జరిగిందని, ప్రజలకు జ్వరాలు ఏమైనా సోకితే జ్వర మా, మలేరియా కాదు అనే నినాదంతో పనిచేసి, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మలేరియా ఉన్నదీ, లేనిదీ నిర్ధారణ చేసి చికిత్సలు అందించాలని అన్నారు. మలేరియా టెక్నికల్ అధికారులు మలేరియా పాజిటివ్ కేసులను గుర్తించి మూడు రోజుల కొక సారి చికిత్స అందించి మలేరియా పాజిటివ్ ఓపిలను చూడటం జరుగుతుందని తెలిపారు. ఒక గ్రామం లో 100 కుటుంబాలు ఉంటే వారిలో ఒక్కరికి మ లేరియా పాజిటివ్ కేసు నమోదు కాబడితే ఆ గ్రా మంలో మలేరియా ఉన్నట్లు గుర్తించి అప్రమత్తం గా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎడియంహెచ్‌ఓ ఉషారాణి, సింగరాజు, జిల్లా మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments