Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

బాబు జగ్జీవన్‌రామ్ అడుగుజాడల్లో నడుద్దాం

bapu

*మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

మన తెలంగాణ/నిర్మల్ : అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించి పోరాడిన డా॥ బాబు జగ్జీవన్‌రాం సిద్దాంతాలను,ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో బాబు జగ్జీవన్‌రామ్ 111వ జయంతి ఉత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ డా॥ బాబు జగ్జీవన్‌రామ్ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేశారన్నారు. దేశాభివృబ్ధితో పాటు దళిత అభివృద్ధి కోసం పోరాడిన మహాయోధుడన్నారు.అలాగే ఎస్‌సిఎస్‌టి చట్టం తీసుకచ్చి బడ్జెట్‌లో వారికి కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేయడం జరిగిందన్నారు. విదేశాల్లో చదువుకునే ఎస్‌సి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు. అలాగే నిర్మల్‌లో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి రూ.2 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, 14న శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాబోయే 6 నెలల్లో పోలీస్, వ్యవసాయశాఖ తదితర శాఖల నియామకాలు చేపట్టునున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ దళితుల అభివృద్ధిలో డా॥ బాబు జగ్జీవన్‌రామ్ కీలకపాత్ర వహించారన్నారు. రక్షణ మంత్రిగా ఎంతగానో సేవలందించారన్నారు. అలాగే దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. జిల్లాలో దళితుల భూమి కొనుగోలు పథకం క్రింద 232 ఎస్‌సి కుటుంబాలకు 688.78 ఎకరాల భూమి, రూ.2652.69 లక్షలతో కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తితో పాటు ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఎఎంసి చైర్మన్ దేవేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, కౌన్సిలర్లు గణేష్, జిల్లా అధికారులు బాల సురేందర్, వెంకటేశ్వర్లు, ప్రణిత, విజయలక్ష్మి, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments