Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

కలెక్టరేట్‌లో మరో వివాదం!

Letter to the UPSC not to be tested on June 2

జూన్ 2న పరీక్షలు నిర్వహించలేమంటూ యూపీఎస్‌సీకి లేఖ
కలెక్టర్ సీరియస్
డిఆర్‌ఒకు షోకాజ్ నోటీసులు
సూపరింటెండెంట్ సస్పెండ్
తప్పు ఇద్దరి అధికారులదైనా శిక్ష మాత్రం ఒక్కరికే! 

మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిపాలనకు సంబంధించి ఎవరికీ వారే నిర్ణయాలు తీసుకుంటుండడం వివాదాస్పదంగా మారుతోంది. పరిపాలన దక్షత కల్గిన అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణాకు మంచి పేరు ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుండడంతో సమస్యలకు దారి తీయడమే కాకుండా అసలు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్, డిఆర్‌ఓ, ఆర్‌డిఓతో పాటు పలు కీలక పోస్టులు ఖాళీగా ఉండడం, ఒకే అధికారి రెండు నుంచి మూడు బాధ్యతలు నిర్వహిస్తుండడంతో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ఎంతో కీలకమైన యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టర్‌కు తెలియకుండానే కిందిస్థాయి అధికారులు నేరుగా యూపీఎస్‌సీ అధికారులకు లేఖ రాయడం రెవెన్యూ శాఖలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సచివాలయం నుంచి సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే కలెక్టరేట్‌లోని పరీక్ష విభాగం సూపరింటెండెంట్‌ను శుక్రవారం సస్పెండ్ చేయడం, డిఆర్‌ఓకు మాత్రం షోకాజ్ నోటీసులతో సరిపెట్టడంతో మరో వివాదానికి ఆజ్యం పోసినట్లైంది.

జూన్ 2న పరీక్షలు నిర్వహించలేమంటూ లేఖ
2019 సంవత్సరానికి సంబంధించి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు యూపీఎస్‌సీ షెడ్యూల్డ్‌ను ఖరారు చేసింది. దీనిపై అభిప్రాయాలు కోరుతూ యూపీఎస్‌సీ అధికారులు జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణాకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ సమన్వయ అధికారి కాగా, డిఆర్‌ఓ సహాయ సమన్వయ అధికారులు కాగా, ఇందుకు సంబంధించి కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగమే ఉంది. ఇదే క్రమంలో యూపీఎస్‌సీ లేఖ అందుకున్న జిల్లా అధికారులు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో ఉద్యోగులు వేడుకలల్లో నిమగ్నం కావడంతో పాటు పాఠశాలలో ఉత్సవాలు జరగనుండడంతో పరీక్షలకు నిర్వహణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక పరీక్ష నిర్వహణ నుంచి హైదరాబాద్‌లోని సెంటర్లను మినహాయించాలని, లేదంటే పరీక్ష తేదీని మార్చాలని కోరుతూ కలెక్టర్ పేరుతో కింది స్థాయి అధికారులే యుపీఎస్‌సీకి లేఖ రాసినట్లు సమాచారం. దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన యూపీఎస్‌సీ అధికారులు నేరుగా ప్రభుత్వ కార్యదర్శి ఎస్.కె..జోషికి లేఖ రాసి ఫిర్యాదు చేయడం, సీఎస్ కలెక్టర్‌ను వివరణ కోరడంతో అసలు విషయం బయటపడింది. కలెక్టర్ దృష్టికి తీసుకురాకుండానే పరీక్షల విభాగం సూపరిండెండ్‌గా విధులు నిర్వహిస్తున్న అంటోని డెనిసిపో ఈ లేఖ సిద్ధం చేసినట్లు తేలడంతో కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేసింది.
విధి నిర్వహణలో నిర్లక్షం వహించారంటూ డిఆర్‌ఓకు మాత్రం షోకాజ్ నోటీసులతో సరిపెట్టడం ఉద్యోగుల్లో చర్చానీయాంశంగా మారింది. డిఆర్‌ఓ ఆదేశాల మేరకు కిందిస్థాయి ఉద్యోగిగా సూపరింటెండెంట్ ఈ లేఖను సిద్ధం చేశారని, తప్పు ఇద్దరిదైనప్పుడు సూపరింటెండెంట్ సస్పెండ్ చేసి, డిఆర్‌ఓకు షోకాజ్ నోటీసుతో సరిపెట్టడంతో రెవెన్యూ ఉద్యోగులలో తీవ్ర చర్చనీయాశంమైంది. పక్షపాత నిర్ణయాలేమింటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైఅధికారుల ఆదేశాల మేరకు పని చేసినా తమ భవిష్యత్తు కూడా ఇంతేనేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments