Search
Saturday 17 November 2018
  • :
  • :

ఎల్‌జి నుంచి ‘జి7 థిన్‌క్యూ’ స్మార్ట్‌ఫోన్

LG G7 ThinQ Released in Korean Market

కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారు ఎల్‌జి కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. ‘జి7 థిన్‌క్యూ’ పేరుతో తాజాగా కొరియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. 4జిబి, 6జిబి ర్యామ్ వేరియంట్లలో విడుదలైంది. 4జిబి ర్యామ్ రూ. 56,490, 6జిబి ర్యామ్ రూ. 61, 390 ధరలకు కస్టమర్లకు లభించనుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ జూన్ మొదటి వారంలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేగాక మొబైల్ లాంచింగ్ సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు కూడా ఉంటాయని సమాచారం.

‘జి7 థిన్‌క్యూ’ ఫీచర్లు….
6.1 ఇంచ్ డిస్‌ప్లే(3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ విత్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్)
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
4/6 జిబి ర్యామ్
64/128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్(2 టిబి వరకు విస్తరించుకునే సదుపాయం)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
4జి విఒఎల్‌టిఇ
డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0 ఎల్‌ఇ
ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్ సి
3000 ఎంఎహెచ్ బ్యాటరీ
క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్

Comments

comments