Home టెక్ ట్రెండ్స్ ఎల్‌జి నుంచి నయా స్మార్ట్‌ఫోన్

ఎల్‌జి నుంచి నయా స్మార్ట్‌ఫోన్

LG V40 ThinQముంబయి: ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ఎల్‌జి త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ వి40 థిన్‌క్యూను జనవరి 20వ తేదీన ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. అదే రోజు అమెజాన్‌లో ఈ ఫోన్‌ను వినియోగ‌దారులు ఎక్స్‌క్లూజివ్‌గా కొనుగోలు చేయ‌వ‌చ్చునని ఎల్ జి వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు జనవరి 19వ తేదీన మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచే ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానున్నాయి. ఎల్‌జి వి40 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లే… వెనుక భాగంలో 16, 12, 12 మెగాపిక్స‌ల్ మూడు కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 5, 8 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండింటిని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఐపి 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. వైర్‌లెస్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను ఇందులో అందిస్తోంది సంస్థ. అయితే, ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు.

ఎల్‌జి వి40 థిన్‌క్యూ అద్భుత ఫీచ‌ర్లు…

6.4 ఇంచ్ ఫుల్ విజ‌న్ ఓలెడ్ డిస్‌ప్లే

 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6 జిబి ర్యామ్‌,

128 జిబి స్టోరేజ్‌, 2 టిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై),

12, 16, 12 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,

5, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ ఫ్రంట్ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,

హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఐపి 68 వాటర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌,

డిటిఎస్ ఎక్స్ 3డి స‌రౌండ్ సౌండ్‌, బూమ్ బాక్స్ స్పీక‌ర్‌,

4జి వివొఎల్‌టిఇ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఇ, ఎన్ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్‌ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

LG V40 ThinQ to launch in India soon