Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సమస్యల వలయంలో విజ్ఞాన భాండాగారాలు

Nalgonda-District-Central-L

నల్లగొండ: సిబ్బంది కొరతతో గ్రంథాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. గ్రంధాలయ ఉద్యమం నాడు ఆంధ్రాలో జాతీయోద్యమానికి తోడ్పాటు నందిస్తే, తెలంగాణాలో సంఘం ఏర్పాటుకు, తెలంగాణా సాయుధ పోరాటానికి బీజం వేసింది. తెలంగాణాలో నాడు 4 శాతం అక్షరాస్యత కలిగిన ప్రజలు ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. విద్యా, వికాస, సామాజిక చైతన్య కేంద్రాలుగా ఆ గ్రంథాలయాలు విరాజిల్లేవి. వట్టికోట ఆళ్వారుస్వామి గుమస్తా, రిక్షా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి వారితో పత్రికలు కొని చదివించేవారు. 1901లో మొదలైన శ్రీకృష్ణదేవరాయ భాష నిలయం ఏర్పాటైన గ్రంథాలయోధ్యమం 1935-40 వరకు సాగుతూవచ్చింది. ఒకరు చదువుతుంటే చదువు రాని వారు వింటూ జ్ఙానచైత్యాన్ని పొందేవారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన గ్రంథాలయాలు అక్షరాస్యత పెరుగుతూ వస్తున్నకొద్దీ నిర్వహణ కొరవడుతూ వచ్చింది. పుస్తక పఠనం తగ్గి పోటీ పరీక్షలకు మెటీరియల్ అందించే స్థాయికి గ్రంథాలయాలు చేరాయి.

1994 నుండి నేటి వరకు ఖాళీగా వున్న లైబ్రేరియన్ పోస్టుల నియ మాకాలు చేపట్టక పోవడమే అందుకు నిదర్శనం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 67 గ్రంథాలయాలు ఉన్నాయి. అందులో 61 శాఖా గ్రంథాలయాలు, 6 గ్రామీణ గ్రంథాలయాలు ఉ న్నాయి. నల్లగొండ జిల్లాలో 27, సూర్యాపేట 18, యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 గ్రంథాలయాలున్నాయి. వీటిలో94 రెగ్యులర్ పోస్టులకు గాను 33 మంది మాత్రమే ఉద్యోగులున్నారు. సిబ్బంది కొరత కారణంగా ఒక్కో లైబ్రేరియన్‌ను 4,5 గ్రంథాలయాలుకు ఇంచార్జి బాధ్య తలు అప్పగించడంతో వందల కిలోమీటర్లు ప్రయాణిం చలేక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. గ్రేడ్3 ఉద్యో గులకు రూ.30,000, అటెండర్‌లకు రూ. 20,000 వేత నాలుగా చెల్లిస్తున్నారు.  61 ఉద్యోగ ఖాళీలో 25 మం దిని పార్ట్ టైమ్, 15 మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యో గులుగా నియమించారు. యాదాద్రిలో 4, సూర్యాపేటలో 10, నల్ల గొండలో 2 అద్దె రహిత భవనాలలో నిర్వహిస్తుండగా మిగతా గ్రంధాలయాలకు స్వంత భవనాలున్నాయి. మొత్తంగా 3 లక్షల, 83 వేల 8 పుస్తకాలు న్నాయి.

నల్లగొండ, సూర్యాపేట గ్రంథాలయాలకు ఇరువురు కలెక్టర్‌లు కృషియల్ బ్యాలెన్స్ ఫండ్ కింద గ్రంథాలయా లకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. నల్లగొండ గ్రంథాలయం 1959లో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 300 మందికి పైగా పాఠకులు పఠనం  కోసం వస్తుంటారు. చైర్మన్ బిల్డింగ్  భవన మరమ్మతులకు అయ్యే ఖర్చును సైతం కలెక్టర్ నిధుల నుండి మం జూరు చేస్తానని మాట ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిల్లా గ్రంథాలయం నిరుప యోగంగా మారింది. పట్టణానికి దూరంగా మీనా నగర్‌లో  గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రజలు అంతదూరం వెళ్ళలేకపోతున్నారు. దీంతో గ్రంథాలయం నిరు పయోగంగా మారుతోంది. 2016లో తెలంగాణ ప్రభుత్వం గ్రంధాలయ పరిషత్ ను ఏర్పా టు చేసి ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాలకు చైర్మన్‌లను నియమించింది. చైర్మన్‌ల నియా మకాలతోనైనా గ్రంథాలయాల నిర్వహణ మెరుగుపడు తుందా అన్న భావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయాలకు నిధులు విడుదల చేయడంతో పాటు, ఖాళీగా ఉన్న పోస్టుల నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

comments