Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నా హృదయానికి దగ్గరైన ‘లై’: నితిన్

LIE

నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన భారీ చిత్రం ‘లై’. ఈ చిత్రం ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్, సుకుమార్, నితిన్, మేఘా ఆకాష్, శ్రీకాంత్, నాజర్, జెమిని కిరణ్, సుధాకర్ రెడ్డి, సునీల్, తరుణ్ ఆదర్శ్, సంతోష్ శ్రీనివాస్, పూర్ణిమ, యువరాజ్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది. సుకుమార్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

కార్యక్రమంలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “లై సినిమా 14 రీల్స్ బ్యానర్ గౌరవాన్ని పెంచుతుంది. నేను మణిశర్మ ఫ్యాన్‌ను. ఆయనతో నేను కూడా పనిచేశాను. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పెద్ద హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు”అని అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ “ట్రైలర్ అదిరిపోయింది. మణిశర్మ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాలో కొత్త లుక్‌లో నితిన్ చాలా బావున్నాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అని చెప్పారు. హీరో నితిన్ మాట్లాడుతూ “మణిశర్మ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. రీ రికార్డింగ్ ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఉంటుంది. అమెరికాలో 75 రోజులు జరుపుకున్న చిత్రమిది.

సౌత్‌లో ఏ సినిమా అన్ని రోజులు అక్కడ షూటింగ్ జరుపుకోలేదు. నా హృదయానికి దగ్గరైన సినిమా ‘లై’. ఫస్ట్‌లుక్ నుండి సినిమాకు పాజిటివ్ టాక్ మొదలైంది. టీజర్‌కు ఎంతో పేరొచ్చింది. హను రాఘవపూడి భవిష్యత్‌లో పెద్ద డైరెక్టర్ అవుతాడు”అని చెప్పారు. హను రాఘవపూడి మాట్లాడుతూ “ఆరు నెలల జర్నీ ఈ సినిమా. నాకంటే ఎక్కువగా నితిన్ ఈ సినిమాను నమ్మాడు. సినిమాలో కొత్త నితిన్‌ను చూస్తారు. మేఘా ఆకాష్ ఎంతో కష్టపడింది. సినిమా అద్భుతంగా రూపుదిద్దుకోవడానికి యూనిట్ సభ్యులు ఎంతో శ్రమించారు. మణిశర్మ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు”అని తెలిపారు.

Comments

comments