Home కరీంనగర్ రైతు యాత్రలో భరోసా ఏది?

రైతు యాత్రలో భరోసా ఏది?

రైతు ఆత్మహత్యలు నిలువరించేందుకు జిల్లాలో కొనసాగుతున్న భరోసా యాత్ర
రైతులకే తెలియకుండా..రైతులే లేకుండా యాత్రలో అంకెల గారడీ
వెళ్లామా వచ్చామా అనే చందం.. మన అధికారుల గ్రామ పర్యటనలు
ముందస్తు సమాచారం ఇవ్వకుండానే గ్రామాల్లోకి వెలుతున్న అధికారులు పెదవి విరుస్తున్న రైతులు
ప్రభుత్వం చెప్పింది అధికారులు ఆచరించారు ఫలితం మాత్రం…?

kmnr1కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలపై సర్కార్ కదిలింది. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పంటలు ఎండిపోయి నష్టాల ఊబిలో కూరుక పోతున్న అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు గ్రా మాల్లోకి వెళ్లాలంది. ఆత్మహత్యల చేసుకోవద్దు ఆదైర్యాన్ని పార దోలేందుకు మేలుకొల్పాలంది. అంతే ఆదేశాలు వచ్చిందే తడువు రైతు భరోసా యాత్ర అంటూ గ్రామాల్లోకి చేరుతున్నారు వ్యవసాయా ధికారులు. రైతులతో మాట్లాడుతున్నారు మరి ఇంకేం అంతా బాగానే ఉందిగా ఇక సమస్య ఎక్కడుందను కోవచ్చు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. అసలు భరోసా యాత్రలో ఏముంటుంది ?..ఎలాంటి సమాచారాన్ని ఎలాంటి ప్రాంతంలో ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలనేదే అధికారులకు తెలియక పోవడమే ఇక్కడున్న అసలు సమస్య వ్యవసాయ శాఖ ఉన్నతాధి కారులతో సహా గ్రామాల్లోకి వెలుతున్న అధికారులు గత ఐదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు రైతులతో మాట్లాడి వెళ్లిన అనంతం అసలు రైతులు ఏమనుకుంటున్నారు ? ఏం కోరుకుంటున్నారు అనే అంశంపై పూర్తి అవగాహన లేక పోగా వారి సమస్యలను వినడం మాని అధికారులకు తెల్సిందే చెప్పి వస్తున్నారు. నిజానికి పంటలు ఎండిపో యి..అప్పులు పెరిగి పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భం జిల్లాలో కనబడుతుండగా అధికారలు రేపటి పూట భరోసా యాత్ర అంకెలను సర్కార్ కు చూపెట్టుకోవడానికి మాత్రమే చేస్తున్నట్టుగా ఉంది.

కారణం గ్రామాల్లోకివెళ్లిన అధికారులు కల్సిన రైతులకు మాత్రమే సూచనలు సలహాలు ఇస్తున్నారే తప్ప…ఇప్పటి వరకు ఒక్క గ్రామానికి కూడా ఏ అధికారి కూడా ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లిన సందర్భాలు లేవనేది మన తెలంగాణ సర్వేలో తేలిన నిజాలు. అంతే కాకుండా ఏదైన కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించాలంటే రైతులు పొలం పనులకు గాని ఇతర వ్యవసాయ పనులకు గాని వెళ్లక ముందే అక్కడికి చేరుకోవాలి అంతే కాని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన నట్టుగా బారెడు పొద్దొక్కిన తర్వాత గ్రామాల్లోకి చేరడం వల్ల ఏదో పది మందికి మించి రైతులు వారికి అందుబాటులోకి రాని పరిస్థితి రైతు భరోసా యాత్రలో కనబడుతోంది. ముందస్తు ప్రణాళిక లేక పోవడం వల్ల అందుబాటులో ఉన్న రైతులు మాత్రమే అక్కడి చేరుకొని అధికారులతో కలుస్తున్నారే తప్ప వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉన్న రైతులకు భరోసా యాత్ర ఊసే ఉండడం లేదనేది ఇప్పటి వరకు భరోసా యాత్ర జరిగిన గ్రామాల్లో రైతులు చెబుతున్న మాటలు. దీంతో రైతులే లేకుండ రైతు భరోసా యాత్ర అనే విధంగా ఉంటోది గ్రామాల్లో భరోసా యాత్ర. దీంతో అధికారులు రోజూ వారి చిట్టాలో పర్యటించిన గ్రామాలు, కల్సిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు యావరేజీగా పదుల సంఖ్యలు దాటడం లేదు. మరి కొన్ని చోట్ల అధికారులు వచ్చి వెళ్లిన విషయం తెల్సుకొని తమకు సమాచారమే లేదంటూ గ్రామ రైతులు పెదవి విరుస్తున్నారు. అయితే జిల్లాలో మొత్తం 57 మండలాలకు గాని దాదాపు 2007 గ్రామాలున్నాయి. వీటిలో ఇప్పిటికే సాధారణ పర్షాపాతానికి నోచు కోని మండలాలు దాదాపు 30 కి పైగా ఉన్నట్టు అధికారులు లెక్కలు చెబుతుండగా…..మిగతా చోట్ల ఓ మోస్తారు వర్షాలు మాత్రమే పడ్డాయి. అయితే ప్రధానంగా జిల్లాలో పత్తి పంటలు వేసిన రైతులకు పెట్టు బడులు ఎక్కవ అవడం తో పాటు వర్షాభావ పరిస్తుతుల కారణంగా రైతాంగం ఒత్తిళ్లకు లోనౌతున్నారు. పైగా అప్పులు చేసిన రైతులకు పంట చేతికస్తే గాని తీర్చ లేని పరిస్థితి కనబడుతోంది.

మరో వైపు ఖరీఫ్ సీజన్ చివరి దశలో ఉన్నందున ఇప్పటికి రైతులు తాము వేసిన పంటల దిగుబడి దిగులు గా మారడంతో భరోసా యాత్ర తో దైర్యం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్థుండగా….ప్రణాళికా బద్దం లేకుండా కింది స్థాయి అధికారుల చేస్తున్న భరోస యాత్రతో రైతులు భోరసా యాత్ర కాస్త ముచ్చట్లుకు కూడా నోచుకోలేక పోతున్నారు. ఏదో వెళ్లామా వచ్చామా అనే చందంగా కాకుండా అధికారులు ముందస్తుగా ఆయా గ్రామాలకు సమాచారం ఇచ్చి వెళ్లాలి లేదా గ్రామ పంచాయితీ ద్వారా దండోరా వేయించాలి ఇవేవి లేకుండా అధికారులు అకస్మాత్తుగా గ్రామాల్లోకి చేరుకొని భరోసా యాత్ర అంటూ హడావిడి చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో సగం మంది రైతులు ఈ కార్యక్రమాలకు హాజరు కాలేక పోతున్నారు.
తక్షమే అధికారులు చేపట్టాల్సిన చర్యలు
ఇప్పటి కైనా ముందుగానే గ్రామ రైతులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీళ్లు లేక పంటలు ఎండి పోతున్న గ్రామాలను గుర్తించి ఆయా గ్రామ రైతులు అధైర్య పడకుండా ఉండేందుకు ముందుగా ఎంపిక చేసిన గ్రామ సందర్శన చేయాలి, ప్రత్యామ్నాయం కోసం దారి చూపాలి.అంతే కాకుండా కేవలం ఎంత మందిని కల్సామా అనే అంకెలు కాకుండా ఎంత వరకు రైతులకు సలహాలు ఇచ్చామనేది చూడాలి. దీంతో పాటు మరో వైపు ప్రభుత్వం చెబుతున్నట్టుగా రానున్న కాలంలో ప్రత్యామ్నాయ పంటలకు కావల్సిన అన్ని సదుపాయాలను రైతులకు ముందుగానే అందించాలని రైతులు కోరుకుంటున్నారు. మరో వైపు ఇప్పటికే జిల్లాలో పదుల సఖ్యలో రైతు ఆత్మహత్యలు జరిగి పోగా వాటి తాలూకు పూర్తి సమాచారాన్ని సర్కార్ కు అందించి వారికి పరిహారం అందేలా చూసి బాధితులు కుటుంబాల్లో దైర్యాన్ని నింపాలి.