Home వనపర్తి వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ జల కవితోత్సవం..

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ జల కవితోత్సవం..

Telangana Jala Kavith celebrationin Vanaparthi district center
రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం..
జలమే . . మానవాళికి జీవనాధారం.. ప్రాణకోటి నాగరికథకు జీవనాధారం జలమే…
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: జలమే మానవాళికి జీవనాధారం.. ప్రాణకోటి నాగరికథకు జీవనా ధారం జలమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి కవి సమ్మేళంనం విజయవంతమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి ,రాష్ట్ర కవులు పేర్కొన్నారు. ఈ కవి సమ్మేళనం లో తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన దాదాపు 520 పైగా కవులు ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. సమ్మేళనంలో పాల్గొన్న తెలంగాణ సాహితీ సమితి అధ్యక్షులు నందిని సిద్దారెడ్డి, ఆచార్య ఎస్వీ రామారావు, ఎల్లూరి శివ, శివశంకర్ , శ్రీనివాస్, ఉమ్మడి పాలమూర్ పరిశోధకులు నిత్యానందరావు, కవి సంఘం అధ్యక్షులు యాకోబ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్,సాహితీ అకాడమీ కార్యదర్శి నరసింహ్మారెడ్డిలు మాట్లాడారు. పాలమూర్ పేరు వినగానే .. పాడి పంటలు గుర్తు వస్తున్నాయని కవులు పాలమూర్. వనపర్తి జిల్లాలను కొనియాడారు. కవి పుంగవుల తెలంగాణ ఉధ్యమం, రాష్ట్రం ఏర్పాటు కోసం ఉధ్యమంలో కవులు అగ్రస్థానంలో పాల్గొన్నారని 31 జిల్లాల కవులు జల కవితోత్సవంలో పాల్గొన్నారు. ఈకార్యక్రమం ఏర్పాటు చేయడం సుభసూచికమన్నారు. నాగరికథ నీరు లేని చోట వెల్లి విరసదని వారు పేర్కొన్నారు. ఈసందర్భంగా కవులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శాలువా ,మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా మిషన్ భగీరథ పథకాల ద్వారా జలం చేరువ వుతుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా కొన్ని వేల చెర్వులను పూడిక తీయడం జరిగిందన్నారు. ఇంటింటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం వేగవంతం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో రైతులు ఒకే పంటలకు నీరు పారించడం జరిగిందన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో రెండు పంటలు పండించేందుకు రైతులకు పుష్కలంగా సాగునీరు అందజేయడం జరుగుతుందన్నారు. కవి సమ్మేళనంలో జయంతి, విమల కొల్లాపూర్, మల్యాల బాలస్వామి, డా.వీరయ్య, నారాయణరెడ్డి , చెన్నయ్య, పద్మావతి, సుధాకరాచారి, పాల్గొన్నారు.