Search
Sunday 23 September 2018
  • :
  • :

‘చీకటి’ కుటుంబంలో వెలుగులు

Light in the 'dark' family
మంచిర్యాల: పంగిడి చీకటి కుటుంబంలో వెలుగులు నిండాయి. మనతెలంగాణ దినపత్రికలో వారికి జరిగిన అన్యాయంతో పాటు జీవన స్థితిగతులను మొట్ట మొదటగా ప్రచురితం కావడంతో మంత్రి కెటిఆర్ స్పందించారు. స్వయంగా పత్రికల్లో వచ్చిన కథనంపై మంత్రి కెటిఆర్ స్పందించి వారికి ఆసరా పించన్‌తో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయడంతో వారి కుటుంబంలో ఆనందాలు వెళ్లివిరుస్తున్నాయి. పండుటాకులు పట్టలేని ఆనందంతో మంత్రి కెటిఆర్‌కు, మన తెలంగాణ దినపత్రికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కొమురం భీం జిల్లాలోని చింతలమానపెల్లి మండలం కర్జెల్లి ఎస్‌టి కాలనీకి చెందిన పంగిడి చీకటి, బాయక్క దంపతులు పూరిగుడిసెలో ఉండగా వారి ఇంటికి రూ. 500లు ఇంటి పన్ను విధించిన సంఘటనతో పాటు వారి కటుంబ జీవన స్థితి గతులను వెలుగులోకి తీసుకురావడంతో వారికి  ఆర్థిక సాయం చేసేందుకు దాతలు తరలివస్తున్నారు. బుధవారం కొమురంభీం జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌ పాటిల్ వారికి ఆసరా పించన్‌తో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తూ మంత్రి కెటిఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని, స్థానిక ఎంపిడిఒ ద్వారా వృద్ధ దంపతులకు తెలియజేశారు. ఇదిలా ఉండగా మనతెలంగాణ దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించి పలువురు దాతలు వృద్ధ దంపతులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎంఎల్‌ఎ పాల్వాయి రాజ్యలక్ష్మి తనయుడు పాల్వాయి హరిష్ బాబు యువసేన ఆధ్వర్యంలో వృద్ధ దంపతులకు ఇంటి ముందు పందిరి వేసి వర్షం కురువ కుండా రేకులు ఏర్పాటు చేశారు. అదే విధంగా దర్జి సంఘం వారు పూరి గుడిసె పై కప్పుకు వర్షం కురువ కుండా టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేశారు. మరికొందరు దాతలు వృద్ధ దంపతుల దయనీయ పరిస్థితులు చూసి వారికి దుస్తులు, వంట సామాగ్రి, సరుకులు, బియ్యం అందజేశారు. ఏదిఏమైనా మనతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్నిచూసి సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Comments

comments