Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆభరణాలంటే ఎంతో ఇష్టం

vidhya-balanచేజారిన ఓ అవకాశం మీదకే విద్యాబాలన్ మనసు మళ్లుతోందట. ఎలాగైనా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కితే బావుంటుందని ఈ భామ ఆశిస్తోంది. విద్య మనసు దోచిన ఆ పాత్ర ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసురాలు, గాయనీమణి అయిన ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జీవితచరిత్ర ఆధారంగా నిర్మించదలచిన చిత్రంలో లీడ్ రోల్.  ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పాత్రకు విద్యాబాలన్ దాదాపు ఖరారయ్యాక  అనుకోని అవాంతరాలతో ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. దాంతో విద్య ఎంతో బాధపడింది. ఎలాగైనా సినిమా తిరిగి మొదలైతే బావుంటుందని కోరుకుంటోంది. అయితే ఆమె ఆ పాత్రలో నటించాలని అంతగా కోరుకోవడం వెనుక చాలా కారణాలున్నాయట. వాటిలో ఒకటి… సుబ్బలక్ష్మి ఆహార్యం. ఆమె ధరించే అందమైన చీరలు, నగలంటే  విద్యకు చాలా ఇష్టమట. ముఖ్యంగా సుబ్బలక్ష్మి ధరించే వజ్రాల చెవిదిద్దులు చాలామందిని ఆకర్షించేవట. ఇప్పటికీ ఆమె ఫొటోలు చూసినప్పుడల్లా ఆమె ధరించిన నగలు చూసి ‘ఓ మైగాడ్’ అనుకునేవాళ్లు చాలామంది. కాంచీవరం చీరల్లో, వజ్రాల నగలతో సుబ్బలక్ష్మిలా  అందంగా కనిపించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఫీలయ్యానని, కానీ అనుకోని కారణాలతో సినిమా నిర్మాణం ఆగిపోవడం చాలా బాధగా ఉందని చెప్పింది విద్యాబాలన్. ఇక అందమైన ఆభరణాలంటే తనకెంతో ఇష్టమని చెప్పింది ఈ భామ. అందమైన చీరలను ధరించి టెంపుల్ జ్యూయలరీతో కనిపిస్తుంటుంది విద్య. ఇక ప్రస్తుతం విద్యాబాలన్ ‘బేగమ్ జాన్’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే మహానటి సావిత్రి పాత్రలో నటించాలని టాలీవుడ్ యువ దర్శకుడు ఒకరు ఈ అందాలతారను సంప్రదించినట్టు సమాచారం.

Comments

comments