Search
Friday 21 September 2018
  • :
  • :

లింకన్ హౌజ్ రూ.750 కోట్లు

lincon-house2దేశంలో నెలకొన్న ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా దేశీయ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారం నిస్తేజంగా కొనసాగుతున్నప్పటికీ, లగ్జరీ ప్లాట్లు, ప్రముఖ భవనాల విక్రయ లావాదేవీల్లో మాత్రం సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ముంబైలోని లింకన్ హౌజ్‌ను పుణెకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ పుణావాలా ఏకంగా రూ.750 కోట్లకు కొనుగోలు చేశారు. ముంబై రియల్టీ మార్కెట్‌లో ఇప్పటివరకిదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందంగా చరిత్రపుటలకెక్కింది. ఇటీవల కుమార మంగళం బిర్లా, ముంబైలోని మలబార్ హిల్స్‌లో ఉన్న జతియా హౌజ్‌ను రూ.425 కోట్లకు కొనుగోలు చేసిన విషయాన్ని మరిచిపోకముందే, ఈ పుణె పారిశ్రామికవేత్త బిర్లా రికార్డును బద్దలు కొట్టారు. దక్షిణ ముంబైలోని బీచ్‌క్యాండి ప్రాంతంలో ఉన్న లింకన్ హౌజ్ , కొన్ని దశాబ్దాలపాటు అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంగా ఉండింది. అమెరికా ప్రభుత్వం 2011లో కాన్సులేట్‌ను బీకేసికి మార్చింది. అప్పటినుంచి ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టారు. రెండు ఎకరాల్లో, యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన లింకన్ హౌజ్‌ను గ్రేడ్-3 చారిత్రక భవనాల జాబితాలోకి చేర్చారు. అయితే ఈ గ్రేడ్ బిల్డింగ్‌లను పునరుద్దరించేందుకు అనుమతి ఉంది. లింకన్ హౌజ్‌ను కుటుంబ నివాసంగా మార్చుకోవాలన్నదే ఈ పారిశ్రామికవేత్త భావనగా ఉంది.

Comments

comments