Home జనగామ 100 టిఎంసిల నీళ్లు ఉంటే… లక్ష ఎకరాలకు సాగునీరు

100 టిఎంసిల నీళ్లు ఉంటే… లక్ష ఎకరాలకు సాగునీరు

Minister Kadiyam Srihari to Visit Medaram Temple

జనగామ: లింగంపల్లి రిజర్వాయర్ పనులకు 3227 కోట్ల నిధులతో ప్రభుత్వం జివొ విడుదల చేసిందని ఉపముఖ్యమంత్రి, విద్యశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ…… లింగంపల్లి రిజర్వాయర్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ వచ్చాకే దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీరందిస్తున్నామని గొప్పగా చెప్పుకున్నారు.

గోదావరిలో ఆరు నెలలు కూడా నీటి నిల్వలు ఉండట్లేదని, గోదావరి ఎత్తిపోతలకు దిగువన బ్యారేజీ నిర్మించి నీరు నిల్వ చేయాల్సి ఉందన్నారు. గోదావరిలో ఏడు టిఎంసిల నీరు నిల్వ ఉండేలా చూడాలని, ఏడు టిఎంసిల నీరు నిల్వ ఉంటే 365 రోజులు ఎత్తిపోతల ద్వారా వినియోగించుకునే అవకాశం ఉందని వెల్లడించారు. 100 టిఎంసి నీటిని ఎత్తిపోతల ద్వారా వినియోగించుకుంటే వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. లింగంపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తే వరంగల్ జిల్లాలో నీటి సమస్య ఉండదన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని కొనియాడారు.