Home తాజా వార్తలు సిమ్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

సిమ్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

SUPREME

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కేంద్రానికి ఆధార్ కార్డు విషయంలో ముఖ్య సూచన చేసింది. దేశంలోని ప్రతీ మొబైల్ యూజర్ నెంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నారని, వారందరికి ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ప్రక్రియను సంవత్సరంలోపు పూర్తి చేయాలని  కోర్టు సూచించింది.