Home తాజా వార్తలు లిక్విడ్ గంజాయి

లిక్విడ్ గంజాయి

 

 

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్టు టీనేజర్లే టార్గెట్‌గా వ్యాపారం
విశాఖ కేంద్రంగా సరఫరా

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో గంజాయిని లిక్విడ్ రూపంలో తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను, రూ.20లక్షలు విలువ చేసే సరకును విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఈ లిక్విడ్ గంజాయి రాకెట్ నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా బిర్యానీ ఫుడ్‌కలర్స్, తేనె బాటిళ్లలో గంజాయి లిక్విడ్‌ను నింపి విక్రయాలు చేపడుతున్నారు. వైజాగ్ నుంచి లిక్వి డ్ గంజాయిని హైదరాబాదుకు తీసుకు వచ్చి, చిన్న చిన్న బాటిళ్లలో నింపి సరఫరా చేస్తున్నారు. బెంగళూరులోని విద్యార్ధులకు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ఉద్యోగులకు గంజాయిని విక్రయిస్తున్నారు. లిక్వి డ్ గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌అధికారులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠా గుట్టుగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. బిటెక్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకు లిక్విడ్ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

Liquid drugs racket arrested in Hyderabad