Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

జోరుగా బెల్టు షాపుల వ్యాపారం

liquor Sales In Villages in Kamareddy District

కామరెడ్డిః కామారెడ్డి జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లో బెల్టు షాపుల మద్యం అమ్మకాలు బార్లను మరపిస్తున్నాయి. దాదపు గ్రామల్లో నిబందనకు నిళ్లోదిలి బెల్టు షాపుల అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతున్నాయి. బెల్టు షాపులకు ఎలాంటి అనుమతులు ఉండవు. అబ్కారి, పోలిసుల లోపాయికారి సహకారంతో యదేచ్చగా బెల్టు షాపులు నడుపుతున్నారు. ఎక్సైజ్ శాఖ వ్యాపారంలో కల్లు నాటు సారా కన్నా విలువైన వ్యాపారం వైన్స్, లిక్కర్ అమ్మకం. సమాజంలో డబ్బు ఉన్నవాళ్లు వైన్స్ షాపులను వేలం పాటల్లో తీసుకుని వ్యాపారం చేస్తుండగా వైన్స్ నుండి బీరు లిక్కర్ బాటిళ్లు తీసుకుని గ్రామాల్లో, అడ్డాల్లో బెల్టు షాపులను దొంగతనంగా నడిపిస్తున్నారు. బెల్టు షాపులు బారు షాపులను మరిపిస్తు అమ్మకాలను కొనసాగిస్తున్నాయి. వైన్స్ షాపుల సహకారంతో ఎక్సైజ్ రూల్స్‌కు తూట్లు పొడుస్తు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. ఇటివల ఒక కోటి రూపాయల విలువైన దొంగ లిక్కర్ పోలీసులు పట్టుకుని కేసు చేశారు. మాచారెడ్డి కేంద్రంగా వైన్స్ షాపుల లూటీకి పాలుపడిన ముఠాను సంగారెడ్డి పోలిసులు ఆరెస్టు చేసిన విషయం తెలిసిందే.

గ్రామాల్లో బారుల షాపుల స్థాయిలో బెల్టు షాపుల లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. రూల్స్‌కు వ్యతిరేకంగా నడుస్తున్న బెల్టు షాపులను నిరోదించాల్సిన ఆబ్కారి అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. గ్రామాల్లోని బెల్టు షాపులు బీర్ల అమ్మకాలకే పరిమితం కాకుండా పలు గొడవలకు కేంద్రంగా మారుతున్నాయి. గ్రామాల్లో మహిళలు బెల్టు షాపులను వ్యతిరేకిస్తున్నారు. పెద్ద గ్రామాల్లో 3,4, చిన్న గ్రామాల్లో 2 బెల్టు షాపులను నడుపుతు లిక్కర్ విక్రయాలను కొనసాగిస్తున్నాయి. ఈ షాపులపై అనేక ఫిర్యాదులు వస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.అనేక గ్రామాల్లో నాలుగు గదుల్లో షాపులను నిర్వహిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో మద్యాన్ని డోర్ డెలివరి చేస్తున్నారు. ఒక్కొ బాటిల్‌కు 30 నుండి 100 రూపాయల వరకు అదనపు రేట్లు వసూలు చెస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ షాపుల్లో కల్తీ మద్యం, ఎన్‌డిపి లిక్కర్ అమ్మకాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. బెల్టు షాపులను అరికట్టె నాధుడు లెడని మహిళలు విమర్శిస్తున్నారు. ఈ షాపులను నియంత్రించాల్సిన వివిధ శాఖల అధికారులు నిర్లక్షం వహించడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కల్తీ, ఎన్‌డిపి మద్యం అమ్మకాలతో సర్కారు రాబడికి గండి పడుతుందని వీటిని తీసుకుంటున్న గ్రామస్థుల ఆరోగ్యాలు పాడవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. బెల్టు షాపుల గురించి కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ను మన తెలంగాణ వాకప్ చేయగా సమాదానాన్ని దాటవేశారు.

Comments

comments