Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కల్లు కల్లోలం

Untitled-1షాద్‌నగర్: కల్లు ప్రియులకు ఉదయం లేవగానే కల్తీకల్లు తాగాలి.. లేదంటే ఏ పని తోచదు.. మరి కొందరికి చేతులు కాళ్ళు వణకడం జరుగుతుంది. జీవితంలో కల్తీకల్లు ఒక భాగంగా భావించే వారికి ఒక్కసారిగా కల్తీకల్లు అమ్మకాలు నిలిపివేయడంతో పిచ్చి ఛేష్టలు చేయడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా కల్లులో మత్తు పదార్ధాలు కలుపరా దన్న ప్రభుత్వ నిర్ణయం మంచిదైనా ఒక్కసా రిగా మత్తు తగ్గించకుండా దశల వారిగా తగ్గిస్తే మంచిదని గ్రామాల్లోని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రసాయనాలతో కల్తీ కల్లుకు చాలా కాలంగా అలవాటు పడ్డవారు మానసిక, శారీరక అనారోగ్యానికి గురవుతున్నారు. షాద్‌నగర్ నియోజక వర్గంలోని వెల్జర్ల, నాగులపల్లి, బుచ్చిగూడెం, కొండన్నగూడ, చిల్కమర్రి, చించోడ్ తదితర గ్రామాల ప్రజలు కల్తీకల్లుకు బానిసలై ఆసుపత్రుల పాలవుతున్నారు. కల్తీ కల్లు తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు చోటు చేసుకున్నాయి. కల్తీ కల్లు ప్రభావం నాడి వ్యవస్థపై పడి క్రమేణా ఆరోగ్యం క్షీణిస్తుంది. మనిషి మెదడు మొద్దుబారేలా చేస్తుంది. దీంతో కల్తీ కల్లు లేక గ్రామాల ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. పిచ్చి చేష్టలతో కలవర పెడుతున్నారు. శని, ఆది వారాల్లో దాదాపు 30 మం ది కల్తీ కల్లు లేక అనారోగ్యాల పాలై షాద్‌నగర్ కమ్యునిటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎక్సైజ్ పోలీస్ దూకుడుతో కల్తీ కల్లు బంద్
కల్తీ కల్లు అమ్మకాలపై ఎక్సైజ్ పోలీసులు దూకుడు పెంచడంతో గ్రా మాల్లో కల్తీ కల్లు అమ్మకాలను నిలిపివేశా రు. గతంలో కల్తీ కల్లు విక్రయాలను ఎక్సైజ్ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో అధిక మోతాదుల్లో మత్తు పదార్ధాలను కలుపడం వల్ల దీనికి బానిసైన ప్రజలు నేడు అది లేకపోవడంతో పిచ్చి ఛేష్టలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో కల్లు విక్రయించే వారికి స్పెషల్ పార్టీ బృందాలు వస్తున్నాయని మత్తు పదార్ధాలు కలుపద్దని, ఉన్న కల్లును పారబోస్తూ గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు హల్‌చల్ చేస్తున్నారు. దీంతో కల్తీకల్లుకు బ్రేక్ పడింది. ఒక్కసారిగా కల్తీ కల్లు లేక ప్రజలు ఇలా అనారోగ్యాల పాలవుతున్నారు. గతంలో కూడా ఇలా మత్తు పదార్ధాలు కలిపే కల్లును నిషేధించి ఉంటే నేడు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని పలువురు పేర్కొంటున్నారు.
బాధితులను సర్కారుఆదుకోవాలని కోరుతున్నారు.
డైజోఫాం ఇంజెక్షన్‌తో కంట్రోల్ చేస్తున్నాం:డాక్టర్ వేణుగోపాల్
గతంలో తయారు చేసే కల్తీ కల్లులో డైజోఫాం, ఆల్పాజోలం అనే రసాయన మత్తు మందును కలుపడం వల్ల ఆ కల్లు తాగిన వారికి ఒక్కసారిగా రసాయనాలు లేని కల్లు తాగడం వల్ల వారు ఇలా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారని అలాంటి వారికి డైజోఫాం ఇంజెక్షన్ ఇస్తూ కంట్రోల్ చేస్తున్నామని షాద్‌నగర్ కమ్యునిటీ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ప్రథమ చికిత్సలు, ఇంజెక్షన్‌లకు తగ్గని వారిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తర లిస్తున్నామన్నారు. కల్తీ కల్లు లేక ప్రజలకు ఫిడ్స్ వచ్చే అవకాశం ఉందని, చికిత్సకు శరీరం సహకరించని పరిస్థితి ఏర్పడుతుం దని, నరాల బలహీనత వచ్చి ఫిట్స్‌వచ్చి, కాలేయం పాడవుతుందన్నారు. తినలేక పోవడం, జీర్ణించుకోలేక పోవడం, నిద్రలే మి ఎక్కువగా ఉండటం, ఆలోచన శక్తి తగ్గు తుంది. విచక్షణ కోల్పోయి పిచ్చిపట్టిన వారిలా ఛేష్టలుచేస్తారన్నారు.. కల్తీ కల్లు తాగక పోవడం వల్ల శరీరంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.

Comments

comments