Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మెదడు చురుగ్గా ఉండాలంటే…

hear-phones1

ప్రస్తుతం పెరుగుతున్న పోటీని తట్టుకోవాలన్నా… ఇంటి బాధ్యతల్ని మెరుగ్గా నిర్వహించాలన్నా మెదడు చురుగ్గా ఉండటం తప్పనిసరి. శారీరక శ్రమతోపాటు మానసిన ఆరోగ్యం కూడా ముఖ్యం. మెదడు ఉత్సాహంగా ఉంచడానికి కొన్ని వ్యాయామాలు చేస్తుండాలి.
వయసు పెరిగేకొద్దీ కణజాలాల పనితీరు మందగిస్తుంది. ఇంటి పనులన్నీ అయిపోయాక టీవీ చూడటానికీ, కంప్యూటర్‌కీ సమయం కేటాయిస్తుంటారు కొందరు.దీని వల్ల మెదడుపై ప్రతికూల వాతావరణం పడి, క్రమంగా చురుకుదనాన్ని కోల్పోతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. అందుకు గంటల తరబడి వాటికి అతుక్కుపోకూడదు.
మెదడు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. వయసు ప్రభావాన్ని మెదడుపై పడకుండా ఇవి కాపాడతాయి. ఒమెగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలూ, అవిసెగింజలూ, వాల్‌నట్ల వంటివి తరచూ ఆహారంలో చేర్చుకోవాలి. వాటితోపాటు ఆలివ్‌నూనె, క్యారెట్లు, ద్రాక్షను కూడా క్రమంగా తీసుకోవాలి.
ఇష్టమైన సంగీతం వినడం, పజిళ్లు పూర్తిచేయడం వల్ల మేలు జరుగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త సాహిత్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కొత్త భాషను నేర్చుకోవడం కూడా మెదడుకు వ్యాయామమే.
పిల్లల మెదడుకు పదునుబెట్టే రకరకాల ప్రశ్నలను వేస్తుండాలి. వాటికి సమాధానాలను వారికి విపులంగా వివరించాలి. అప్పుడప్పుడూ చిన్న పిల్లలతో ఆటలను ఆడుతుండాలి.
భార్యాభర్తల మధ్య విభేదాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఈ ప్రభావం జ్ఞాపకశక్తిపై పడుతుంది. సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి. ఎల్లప్పుడూ చిరునవ్వును చెదరనివ్వకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

Comments

comments