Home తాజా వార్తలు జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో పిల్

జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో పిల్

Jayalalithaa

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ సిఎం 75 రోజులపాటు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 5న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా ఓ స్వచ్ఛంద సంస్థ… సిబిఐ విచారణ, వైద్య నివేదికలు స్వాధీనం చేసుకోవాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో అమ్మ మృతిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అమ్మ మృతిపై ఇప్పటికే నటి గౌతమి, శశికళ పుష్పలతోపాటు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.