Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఆశావహ ధృక్పథంతో హాయిగా జీవించండి

గ్లాసులో సగం వరకే నిండిన నీటిని చూసి… సగం మాత్రమే నిండి ఉందంటారా..? సగం గ్లాసు నిండి ఉందంటరా..? మీరు రెండో రకానికి చెందిన వారైతే ఎక్కువకాలం ఆరోగ్యంగా బతుకుతారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి..

babyలాంగ్ రన్నింగ్ నర్సెస్ హెల్త్ స్టడీ వారు 2004 సంవత్సరంలో 70,000 మంది మహిళలకు ఆశావహ ధృక్పథం కు సంబంధించిన అంశం పై కొన్ని ప్రశ్నలను అడిగారు,సమాధానం ఇచ్చిన వారిలో 2006-2012 మధ్య కాలంలో మరణించిన వారి వివరాలను పరిశీలించారు.పరిశోధకులు అడిగిన ప్రశ్నలకు ఆశావహంగా స్పందించినవారిలో 29 శాతం మంది నిరాశావాదుల కంటే మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించినట్లు నిర్ధారించింది.అలాగే వారిలో క్యాన్సర్,హృదయ సంబంధ సమస్యలు,శ్వాశకోశ సమస్యలు,ఇన్ఫెక్షన్లు వంటివి అంతగా లేవని చెప్పింది పరిశోధన.
ఆశావహంగా జీవించేవారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారనీ,వ్యాయామం తప్పకుండా చేస్తారనీ దీనివల్ల శరీరంలోని మిగిలిన వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు.
హృదయం పదిలం- ఆశావహ ధృక్పథం కలవారికి గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు యునివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు.
తాజా పడ్లు,కూరగాయలతో- తాజా పండ్లు,కూరగాయల్లో ఉండే ఆంటాక్సిడెంట్లు,విటమిన్-ఇ వంటివి పాజిటివ్‌గా ఉండేలా, ఆలోచించేలా చేస్తాయని చెబుతున్నారు.ఎక్కువ మోతాదులో గోధుమ తీసుకున్నవారిలో కెరోటినాయిడ్ శాతం ఎక్కువగా ఉండి పాజిటివ్‌గా ఆలోచించేలా చేస్తాయని చెబుతున్నాయి పరిశోధనలు.

Comments

comments