Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కోర్టుల్లో విచారణల ప్రత్యక్షప్రసారం?

Supreme Court Issues Notice to Centre on Lokpal Appointment

న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాల్లో జరిగే విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై సలహాలు, సూచనలు అందించాలని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎఎం ఖన్విల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం కోరింది. కోర్టుల్లో జరిగే విచారణలను ప్రత్యక్ష ప్రసారం, వీడియో రికార్డింగ్ చేసే అవకాశంపై కేం ద్రం స్పందనను తెలియజేయాలని సుప్రీంకోర్టు గత మే 3న  ప్రభుత్వాన్ని ఆదేశించింది. చాలా దేశాల్లో కోర్టు లోపల కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారం చేయడానికి అంగీకరిస్తున్నారని అంతకు ముందు అటార్నీ జనరల్ కోర్టుకు తెలియజేశారు. పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రతి రాష్ట్రంలోని  ట్రయ ల్ కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో సిసి టివిల ఏర్పాటుకు సుప్రీంకోర్టు గత ఏడాది అనుమతించింది. సర్వోన్నత న్యాయస్థానంలోకూడా లైవ్‌స్ట్రీమింగ్ గదులను ఏర్పాటు చేసి న్యాయవిద్యలో ఇంటర్న్‌షిప్  చేస్తున్న విద్యార్థులను అనుమతించాలని జోధ్‌పూర్ నేషనల్ లా యూనివర్శిటీ విద్యార్థి స్వప్నిల్ త్రిపాఠి తన పిటిషన్‌లో కోరారు. ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థులు కోర్టు కార్యకలాపాలను వీక్షించేందుకు అనుమతించాలని కూడా ఆయన తన పిటిషన్‌లో కోరారు.

Comments

comments