Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

చావుబతుకుల్లో ప్రియుడు.. ఫేస్‌బుక్‌లో లైవ్ విడియో

Live-video-on-Facebookమిన్నెపోలిస్: అమెరికాలోని మిన్నెసోటాలో దారుణం జరిగింది. ట్రాఫిక్ పోలీసు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు కారులో ఉండగానే అతనిపై పోలీసు కాల్పులు జరిపాడు. అయితే కాల్పులు జరిగిన సమయంలో పక్కనే ఉన్న ప్రియురాలు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఫేస్‌బుక్ లైవ్‌స్ట్రీమింగ్‌లో విడియో పెట్టింది. ఆస్పత్రికి తీసుకెళుత లైవ్‌స్ట్రీమింగ్ ద్వారా స్నేహితులకు చేరవేసింది. ఈ ఘటన మిన్నెసోటాలోని మిన్నెపోలీస్‌లో జరి గింది. బాధితుడిని 32ఏళ్ల ఫిలాండో కాస్‌టైల్‌గా గుర్తించారు. కాల్పుల అనం తరం అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపో యాడు. కాల్పులు జరిపిన సెయింట్ ఆంథోనీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సదరు ట్రాఫిక్ పోలీసు వివరాలు తెలియరాలేదు. తన ప్రియుడిని అకారణం గా చంపేశారని లావిష్ రేనాలడ్స్  వాపోయింది. ఫిలాండో దగ్గర ఆయుధం ఉందని, దానికి సంబంధించిన లైసెన్స్ చూపించేందుకు వాలెట్ తీస్తుండగానే   పోలీస్ కాల్చాడని ఆమె రోదిస్తూ చెప్పింది.

Comments

comments