Home ఆఫ్ బీట్ నాలుకతో భయపెడతాయి

నాలుకతో భయపెడతాయి

Lizard

సాధారణంగా కొన్ని జంతువులు తమను తాము రక్షించుకోవడానికి తమ శరీరంలోని భాగాలనే ఆయుధాలుగా ఉపయోగించుకుంటాయి. టోంగ్యుడ్ స్కింగ్ అనే ఓ రకమైన బల్లులు శత్రువులను భయపెట్టడానికి ప్రకాశవంతమైన నీలం రంగులో ఉన్న తన నాలుకను తెరుస్తుందట. అంతే శత్రువులు దెబ్బకు పరిగెత్తి పారిపోతారట. టోంగ్యుడ్ ఇదో రకమైన బల్లి. ఏవైనా వీటిపై దాడికి వచ్చినప్పుడు ఈ బల్లి తన నోటిని తెరుస్తుందట. ముదురు నీలంగా ఉన్న తన నాలుకతో భయపెడుతుందట. ఆ నాలుకలో ఆల్ట్రా వయొలెట్ కిరణాలు ప్రసరిస్తాయని ఆస్ట్రేలియాలోని మక్వారీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. వీటికి శత్రువులైన పక్షులు, పాముల నుంచి ఇవి తమ నాలుక ద్వారా కాపాడుకుంటాయిట. ఈ రకమైన బల్లులు ఉత్తర అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మనుస్యుల కంటే తేజోవంతంగా వీటి కళ్లు పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని బిహేవియర్ ఎకోలజీ, సోషియో బయోలజీ అనే జర్నల్‌లో ప్రచురించారు.