Home కరీంనగర్ ఐస్‌క్రీమ్‌లో బల్లి…

ఐస్‌క్రీమ్‌లో బల్లి…

 ice cream 

హుజూరాబాద్:  యువకుడు కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో బల్లి కన్పించిన సంఘటనా  జిల్లాలోని హుజూరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. రాంపూర్‌కు చెందిన వనం శ్రీకాంత్ అనే యువకుడు రంగాపూర్ శివారులో తోపుడు బండి వద్ద ఐస్‌క్రీం కొనుగోలు చేశాడు. అది తింటుండగా బల్లి కనబడడడంతో ఒక్కసారిగా వాంతులు చేసుకున్నాడు.ఈ ఘటనతో ఐస్‌క్రీమ్ తయారీదారులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ , గ్రామస్థులు  కోరారు.

Lizard in ice cream Incident In KarimNagar