Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

థమ్సప్ బాటిల్లో బల్లి

Thumbs-Up-Bottle

శ్రీరంగాపురం : మండల పరిధిలోని జానంపేట గ్రామంలో ఖయూం కిరాణం, కూల్‌డ్రింక్ షాపులో అదే గ్రామానికి చెందిన వ్యక్తి థమ్సప్ బాటిల్ ను కొనుగోలు చేయగా థమ్సప్ బాటిల్ బల్లి కనిపించింది. మండల కేంద్రంలో కూడా కిరాణం షాపులో కూల్ డ్రింక్ బాటిల్‌లో చనిపోయిన పాముపిల్ల కనిపించింది. ఈ విధంగా అనేక సార్లు జరిగినా ఫు డ్ సేప్టీ అదికారులు సంబందించిన కూ ల్ డ్రింక్ కంపెనీలపై ఎటువంటి చర్య లు తీసుకోకపోవడంతో ఇటువంటి పరి స్థితు లు పునరావృతం అవుతున్నాయి. గతంలో అనేక సార్లు కూడా బల్లులు,ఇతర పురుగులు ఉన్నప్పటికీ ఆయా కంపెనీల యాజమాన్యాలు తిరిగి అదే విధానాలను అవలంబిస్తున్నాయి. ఇప్పటికే అందులో తీవ్రమైన రసాయానాలు ఉంటాయని చెబుతున్నారు. వేసవి కాలం కావడంతో కొందరు శీతల పానీయాల వైపు వెళ్తు న్నారు. విని యోగదారులు సంబందిత పోలీస్ స్టేషన్ లో గాని ఫుడ్ సేప్టీ అదికా రులకు పిర్యాదు చేస్తే అటువంటి కంపెనీ లపై తగు చర్యలు వినియోగదారులు కోరు తున్నారు.

Comments

comments