Search
Friday 21 September 2018
  • :
  • :

ఏజెన్సిలో పాఠశాలల మూత … నిద్రమత్తులో విద్యశాఖ

Locking schools in several villages in the scorching zone
అచ్చంపేట : మండల పరిధిలోని ఏజెన్సి గ్రామాలలో పాఠశాలలకు తాళాలు వేయడంతో విద్యార్థులకు విద్య అందని దాక్షగా మారిన సంఘటన శనివారం అచ్చంపేటల మండలంలో చోటు చేసుకుంది. మనతెలంగాణ ఏజెన్సిలోని పలు పాఠశాలలను విజిట్ చేయగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన్నెవారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు ముగ్గురు రెగ్యులర్ టీచర్లను ప్రభుత్వం కేటాయించగా వారు విధులకు శనివారం ఎగనామం పెట్టి సొంత వ్యాపారాలు, పనులు చూసుకుంటున్నారు. పక్కనే ఉన్న మన్నెవారిపల్లి ప్రాథమిక పాఠశాల కూడా తాళం వేసి కనిపించింది. ఈ తంతూ గత ఏడాది నుండి జరుగుతందని ప్రభుత్వ ఉపాద్యాయులు సక్రమంగా విధులకు హజరు కాక అక్కడ అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు అక్షరం ముక్కరాకపొవడంతో తల్లిదండ్రులు విసిగివేసారికొని తమకు ఆర్థికంగా భారమైన ప్రైవేటు పాఠశాలలలోనే చేర్పించుకుంటున్నామని పలువురు గ్రామస్తులు తెలిపారు. శనివారం ఉదయం 11గంటలకు మనతెలంగాణ మన్నెవారిపల్లి ప్రాథమిన్నత పాఠశాలను పరిశీలించుటకు వెళ్ళాగా ఉన్న నాలుగు గదులకు తాళాలు బిగించి ఉండడం ఉపాద్యాయులు, విద్యార్థులు అక్కడేవ్వరు కనిపించకపోవడంతో ఆశ్చర్యం వేసింది. లింగనోనిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాద్యాయలు విధులకు డూమ్మ కొట్టడంతో మిని అంగన్‌వాడి టీచర్ నామమత్రంగా విధులకు హజరయ్యారు. ఆమె కూడా తన రికార్డు పనులను చూసుకుంటున్నారు. విద్యార్థులు ఎవ్వరు లేక పొవడం గమనర్హం. చిన్యాతాండ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ ఉపాద్యాయులు వెంకట్రాములు విధులకు హజరుకాలేదు. విద్యార్థులు ఎవ్వరు లేరు. విద్యాధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఏజెన్సిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వేలకు వేలు జీతాలు తిసుకుంటు నిత్యం విధులకు ఏగనామం పెడుతున్నారని ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాద్యాయులు విధులకు హజరు కాకుండా తమ సొంత వ్యాపారాలు, పనులు చేసుకుంటు విద్యార్థుల బంగారు భవిష్యత్తులను బుగ్గిపాలు చేస్తున్నారని ఏజెన్సి వాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయపై ఎంఇఒ చందునాయక్ ను మన తెలంగాణ వివరణ కోరగా తాను పక్క జిల్లా నల్గొండకు బదిలి అయ్యానని ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్నానని ఇంచార్జి ఎంఇఒ గా ప్రభుత్వం ఎవరిని ఇప్పటి వరకు నియమించాలేదని మన తెలంగాణ ఎజెన్సిలో పాఠశాలలకు ఉపాద్యాయులు హజరు కాని విషయం విద్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తిసుకవెళ్ళి ఉపాధ్యాయులపై చర్యలు తిసుకుంటామని తెల్చి చెప్పారు.

Comments

comments