Home వార్తలు లోధా సంస్కరణలు అక్రమం, రాజ్యాంగ విరుద్ధం

లోధా సంస్కరణలు అక్రమం, రాజ్యాంగ విరుద్ధం

lodhaన్యూఢిల్లీ: బిసిసిఐ సంస్కరణలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సుప్రీం కోర్టు జడ్జీ మా ర్కండేయ కట్జూ ఆదివారం విమర్శలు గుప్పిం చారు. ఆ సంస్కరణలు అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. సు ప్రీంకోర్టు తీర్పు అమలుపై సలహాదారుగా ఆయనను బిసిసిఐ నియమించింది. రాజ్యాం గం ప్రకారం మనకు శాసనసభ, కార్యనిర్వా హక వ్యవస్థ, న్యాయవ్యవస్థ ఉన్నాయని, ఒకవే ళ న్యాయ వ్యవస్థ శాసనాలు చేయడం మొద లెడితే అది ప్రమాదకర నాంది కాగలదని కట్జూ  అన్నారు. సమీక్ష కోసం బిసిసిఐ సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం ముందు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా కూడా తాను సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. బిసిసిఐను శిక్షిం చడానికి సుప్రీంకోర్టు అవుట్ సోర్స్ కమిటీకి నిర్ణయాధికారాని ఇచ్చిందన్నారు. లోధా కమిటీని ఆయన అవుట్ సోర్స్ కమిటీగా సూచించారు. ఇదిలా ఉండగా జస్టిస్ కట్జూ రూపొందించిన తాత్కాలిక రిపోర్టును అధ్యయ నం చేశాకే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు. బిసిసిఐలో గురించి మాట్లాడినట్టయితే, న్యా యవ్యవస్థలో కూడా సంస్కరణలు అవసర మేనని, భారతీయ కోర్టుల్లో దాదాపు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఈ పోకడ ఇలాగే కొనసాగిస్తే రేపటి దినాన పత్రి కా రంగం సంపాదకీయ విధానాలను, పాత్రికే యుల పదవీ కాలాన్ని  కూడా సుప్రీం కోర్టు నిర్దేశించే అవకాశం ఏర్పడగలదని. ఇది ప్రమా దకర పోకడకు తెరతీయగలదని కట్జూ అభిప్రాయపడ్డారు.