Home జాతీయ వార్తలు శ్రీనగర్ ఓటు రణ రక్తసిక్తం

శ్రీనగర్ ఓటు రణ రక్తసిక్తం

  • లోక్‌సభ ఉప ఎన్నికలో హింస, భద్రతా దళాల కాల్పుల్లో 8 మంది మృతి
  • భయంతో పారిపోయిన సిబ్బంది, 6.5% మాత్రమే పోలింగ్

clash-in-srinagar

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఆదివారం శ్రీనగర్ లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంగా హింసాకాండ చెలరేగింది. అల్లరిమూకలను అదుపులో పెట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 8 మంది చెందారు. పలువురు గాయపడ్డారు. నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల పోలింగ్ ప్రారంభం నుంచే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్పా టువాదులు, పలు సంస్థలు శ్రీనగర్ ఉప ఎన్నిక బహిష్కరణకు, బంద్‌కు పిలుపునివ్వడంతో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతకు దారితీసింది. హింసాత్మక ఘటనలతో, కాల్పులతో సాయంత్రానికి కేవలం 6.5 శాతం పోలింగ్ నమోదయినట్లు వెల్లడైంది. బద్గామ్ జిల్లాలో బీర్‌వా, ఛరారే షరీఫ్‌లో పకేర్‌పోరా ప్రాంతంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. బద్గామ్ జిల్లా లోనే ఛదూరా ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పుల్లో చనిపోయారు. ఛదూరా అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక కూడా ఉండటంతో ఇక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. మాగాం పట్టణంలో ఓ వ్యక్తి చనిపొయినట్లు అధికారులు తెలిపారు. గుల్మార్గ్ ప్రాంతానికి ఈ పట్ణణం ముఖద్వారంగా ఉంటుం ది. తీవ్రస్థాయిలో నిరసనలు వెలువడటంతో బద్గామ్ జిల్లాలో దాదాపు 70 శాతం పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది భయంతో వెళ్లి పోవడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్‌ను నిలిపివేయడానికి పలు చోట్ల ప్రదర్శనగా సాగిన గుంపు విధ్వంసం సృష్టించింది. శ్రీనగర్ నియోజవకవర్గ పరిధిలోకి వచ్చే ఓ పోలింగ్ బూత్‌ను తగుల బెట్టడానికి అల్లరిమూకలు యత్నించాయి. పెట్రోల్ బాంబులు విసరడం, రాళ్లు రువ్వడం వంటి ఘటనలతో పరి స్థితి విషమించడంతో సైనాన్ని పిలిపించారు. భద్రతా బలగాలకు వారు బాసటగా నిలిచి అల్లరిమూకలను అదుపులో పెట్టే ప్రయత్నాలు చేశా రు. పలు ప్రాంతాలలో ఎన్నికల ఘట్టం చివరికి యుద్ధపరిస్థితిని సృష్టిం చింది. వందలాది మంది నిరసనకారులు పకేర్‌పోరాలోని ఛరారే షరీఫ్ ప్రాంతంలో పోలింగ్ కేంద్రంలోకి చొరబడ్డారు. ఈ భవనాన్ని ధ్వంసం చేశారు, తొలుత భద్రతా బలగాలు పలుసార్లు వార్నింగ్ రౌండ్ కాల్పులు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరికి అల్లరిమూకలపైకి కాల్పులు జరపా ల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. కాల్పుల్లో ఆరుగురు చనిపోయినట్లు వీరిలో ఇరవై సంవత్సరాల మహమ్మద్ అబ్బాస్, 15 సంవత్సరాల ఫైజాన్ అహ్మద్ రథేర్ ఉన్నట్లు వెల్లడించారు.మరో ప్రాంతంలో జరిగిన కాల్పులలో నిసార్ అహ్మద్ మృతి చెందారు. మాగాం పట్ట ణంలో ఆదిల్ ఫరూక్ అనే యువకుడు మృతి చెందారు. ఆయనకు పలు బుల్లెట్ గాయాలు అయినట్లు వెల్లడైంది. బీర్‌వా ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో అఖిబ్ వనీ అనే వ్యక్తి మృతి చెందారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వ హించడంలో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని ప్రభు త్వ యంత్రాంగం విఫలం అయిందని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. మాజీ సిఎం, సీనియర్ నాయకులు అయిన ఫరూక్ అబ్దులా శ్రీనగర్ ఎంపీ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు.
ఓటేయడానికి వచ్చినవారిపై దాడులు : ఛెనార్ ప్రాంతం లో ఓటు వేయడానికి వెళ్లుతున్న మహమద్ రంజాన్ రథేర్ భార్యతో కలిసి ఓటేయడానికి వెళ్లుతుండగా నిరసనకారు లు వారిపై దాడికి దిగారు. దీనితో ఆయన తలపగిలి రక్తం చిందడంతో కంగాన్ జిల్లా ఆసుపత్రిలో చికిత్సకు తరలిం చారు. నిరసన పిలుపును పట్టించుకోకుండా ఓటేయడానికి బయలుదేరిన గ్రామస్తులపై కూడా దాడులు జరిగినట్లు తెలిసింది. సమీపంలోని వకూరాలో హింసాత్మక ఘటన లతో నిర్మానుష్యం నెలకొంది. పలు చోట్ల అల్లరిమూకలు భద్రతా బలగాలపైకి పలు రాళ్లు విసిరాయి. దీనితో వారిని చెదరగొట్టేందుకు వారు కాల్పులకు దిగాల్సి వచ్చింది.
కేవలం ఆరున్నర శాతం పోలింగ్ : శ్రీనగర్ లోక్‌సభ ఉప ఎన్నికలలో హింసాత్మక ఘటనలతో అత్యంత అల్పస్థాయి లో కేవలం 6.5 శాతం పోలింగ్ నమోదైంది. పలుచోట్ల వేర్పాటువాదులు ప్రజలను ఓటింగ్‌కు వెళ్లకుండా అడ్డుకో వడం, ప్రజలు ఘర్షణలతో భయపడటంతో ఎన్నికల ప్రక్రియ దెబ్బతింది. పలు ప్రాంతాలలో పోలింగ్ సిబ్బంది కూడా హాజరు కాలేకపొయినట్లు తెలిసింది. సాయం త్రానికి ఆరున్నర శాతం పోలింగ్ రికార్డు అయినట్లు రాష్ట్ర ఎన్కిల ప్రధానాధికారి శంతను విలేకరులకు తెలిపారు. హింసాకాండలో వందకు పైగా భద్రతా సిబ్బంది గాయప డ్డట్లు వెల్లడించారు. వంద అంతకు మించి స్థానాల్లో రీపోలింగ్‌కు ఆదేశించే వీలుందని తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్ నాగ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 12న జరుగుతుంది., ఇక్కడ ముఖ్యమంత్రి మెహబూ బా ముఫ్తీ సోదరుడు తసదఖ్ ముఫ్తీ తొలిసారిగా అధికార పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు.