Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ ఎంపిలు గెలిస్తే తెలంగాణకు లాభం: కెటిఆర్

టిఆర్‌ఎస్ ఎంపిలు గెలిస్తే తెలంగాణకు లాభం: కెటిఆర్

 

KTR

 

 

హైదరాబాద్: ఎంపి ఎన్నికలలో బిజెపి గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీకి లాభం అని, ఎంపి ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం అని, 16 మంది టిఆర్‌ఎస్ ఎంపిలు గెలిస్తే తెలంగాణకు లాభం జరుగుతుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో కెటిఆర్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి.  బోథ్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ హక్కుల సాధన కోసం పేగులు తెగేదాక కొట్లాడే దమ్మున్న ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని, ఢిల్లీ గులాంలు కావాలా…. తెలంగాణ గులాబీలు కావాలా ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్, బిజెపిలతో ఒరిగిందేమీ లేదని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘటన టిఆర్‌ఎస్‌కు దక్కుతుందన్నారు. జైకిసాన్ అనేది వారికి ఒక నినాదం ఉందని… కానీ టిఆర్‌ఎస్‌కు ఒక విధానం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీని శాసించి తెలంగాణను తెచ్చుకోవాలంటే 16 ఎంపిలు గెలువాలని తెలంగాణ ప్రజలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఎంపి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బిజెపిలకు మరోసారి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

 

Lok Sabha Elections: KTR Fire on Congress, BJP