Home తాజా వార్తలు లోక్‌సభ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌దే హవా

లోక్‌సభ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌దే హవా

Lok Sabha Elections ... Republic TV C-Voter Surveyఢిల్లీ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ హవానే కొనసాగనుందని రిపబ్లిక్ టివి సి- ఓటర్ సర్వేలో తేలింది. తెలంగాణ పరిధిలో ఉన్న 17లోక్ సభ స్థానాల్లో 16 స్థానాల్లోనూ టిఆర్‌ఎస్ మాత్రమే విజయం సాధించిందని ఈ సర్వేలో తేలింది. 43 శాతం ఓట్లతో టిఆర్‌స్ అఖండ విజయం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి అడ్రస్సు గల్లంతు కానుందని ఆ సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలపై కూడా పబ్లిక్ టివి సి- ఓటర్ సర్వే చేసింది. ప్రజలు అధికార టిఆర్‌ఎస్ వైపే ఉన్నారని ఈ సర్వే తేల్చి చెప్పింది.

Lok Sabha Elections … Republic TV C-Voter Survey