Home జాతీయ వార్తలు అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 రోజుల గడువు

అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 రోజుల గడువు

Lok Sabha Speaker Sumitra Mahajan declared 10 Days time for Floor Test

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై టిడిపి సహా పలు పార్టీల సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసులు తనకు అందాయని స్పీకర్‌ చెప్పారు. అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్‌ సభముందు ఉంచారు. తీర్మానంపై చర్చ ఎప్పుడు జరిగేదీ తేదీని 10 రోజుల్లో ప్రకటిస్తానని స్పీకర్ తెలిపారు. టిడిపి ఎంపి కేశినేని నాని ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని స్పీకర్‌ సభ ముందు చదివారు. తీర్మానానికి 50 మందికిపైగా సభ్యులు మద్ధతు ప్రకటించారు. తీర్మానంపై చర్చకు అవసరమైన సభ్యుల సంఖ్య ఉన్నట్లు తేలడంతో చర్చకు అనుమతి ఇస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. అయితే, తీర్మానానికి మొదట నోటీసులు ఇచ్చినవారికే తొలి అవకాశం ఇవ్వనున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. కాగా, టిడిపి తీర్మానాన్ని మాత్రమే సభలో చదవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.  మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.