న్యూఢిల్లీ: అవిశ్వాసంపై చర్చలో భాగంగా ఎంపి గల్లా జయదేవ్ లోక్సభలో మాట్లాడుతుండగా స్పీకర్ సుమిత్రా మహాజన్ అడ్డు చెప్పారు. మీకు ఎంత సమయం కేటాయించడం జరిగిందని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తనకు మరింత సమయం కావాలని జయదేవ్ చెప్పారు. అది కుదరదని, మరో ఐదు నిమిషాల్లో ముగించాలని స్పీకర్ సూచించారు. అయితే, గతంలో అవిశ్వాసంపై చర్చ జరిగినప్పుడు ఎవరూ కూడా గంట కంటే తక్కువగా చర్చ జరపలేదని, తాను ఆ రికార్డులను పరిశీలించే మాట్లాడుతున్నట్టు గల్లా వివరించారు. చరిత్ర గురించి మాట్లాడటం సరి కాదని, వర్తమానం గురించి మాట్లాడంటూ గల్లాపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఇక అవిశ్వాసం చర్చల్లో భాగంగా టిడిపికి 13 నిమిషాల సమయం కేటాయించిన విషయం తెలిసిందే.