Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రాహుల్ ప్రవర్తనపై స్పీకర్ అసహనం

Sumitra-mahajan

న్యూఢిల్లీ: ప్రధాని మోడీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్న తీరు గౌరవప్రదంగా లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అసహనం వ్యక్తం చేశారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా ప్రసంగిస్తున్న బిజెపి ఎంపి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగానికి టిడిపి సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోడియం దగ్గరకు టిడిపి వెళ్లి ఎంపిలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకోనడంతో లోక్ సభను 4.30 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తరువాత సుమిత్రా మహాజన్ మాట్లాడారు. సభలోని సభ్యులంతా సంప్రదాయాలు పాటించాలన్నారు. ప్రధాని స్థానంలో ఎవరున్నా, ఆ స్థానాన్ని గౌరవించాలని ఆమె సూచించారు. మోడీని రాహుల్ ఆలింగనం చేసుకున్న సమయంలో అసలు సభలో ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని  ఆమె వ్యాఖ్యానించారు.

Comments

comments