Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

లోకేశ్ ఢిల్లీకి సైకిల్ పై వెళ్లి నిరసన తెలపాలి:పవన్

pawan

విశాఖపట్నం: చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌, జగన్‌ కలిసి పోరాడితే విశాఖకు రైల్వే జోన్‌ తప్పక వస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి లోకేశ్‌ సైకిల్‌ యాత్ర చేయాలని, ఎపికి అన్యాయం చేస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ లోకేశ్ ఢిల్లీకి సైకిల్ పై వెళ్లి నిరసన తెలపాలని సూచించారు. శనివారం విశాఖపట్టణంలోని బీచ్‌రోడ్‌లో నిర్వహించిన జన పోరాట సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ…   తనపై రైల్వే కేసులు పెట్టినా ఈ విషయంలో తాను నిలబడతానని పేర్కొన్నారు. గురువు, దైవం లాంటి తన అన్నయ్యను కాదని నాడు టిడిపికి మద్దతు ఇచ్చానన్నారు.  కానీ, ఈరోజు ఉత్తరాంధ్రను అడ్డగోలుగా దోచేస్తున్నారని పవన్ ఆరోపించారు. టిడిపి వాళ్లు పోగొట్టుకోవడానికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, తనకు ఒంటిపై బట్టలు తప్ప మరేమీ లేవన్నారు. అంతకుముందు ప్రత్యేక హోదా, విభజన హామీల లక్ష్యసాధన లక్ష్యంగా విశాఖ బీచ్‌ రోడ్డులో జనసేన పార్టీ నిరసన కవాతు నిర్వహించింది. కాళీమాత ఆలయం నుంచి వుడా పార్కు వరకు ఈ కవాతు సాగింది. ఈ కవాతులో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో పాటు భారీ సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

Comments

comments