Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

గుండెపోటు వచ్చే ముందు జయ పెరుగన్నం తిన్నారు: బాలె

Bale

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్సపై అపోలో వైద్యులు సోమవారం వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా లండన్ వైద్యుడు రిచర్డ్ బాలె మాట్లాడుతూ… తమిళనాడు ప్రభుత్వ సూచన మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జయలలితకు సాధ్యమైనంత అత్యుత్తమ చికిత్స అందించామన్నారు.

జయకు ఎలాంటి అవయవ మార్పిడి చికిత్స చేయలేదని, జయ కాళ్లు తొలగించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు. అలాగే అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు శశికళతో పాటు, సిఎస్‌కు రిపోర్టు చేశామన్నారు. జయలలిత మృతిపై జరిగిన ప్రచారమంతా వదంతులేనని ఆయన పేర్కొన్నారు. కాగా జయలలిత ఆస్పత్రికి వచ్చేసరికే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందన్నారు. దాంతో ఆమె అవయవాలు పాడయ్యాయని వివరించారు. జయకు వైద్యం విషయంలో రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు.

జయలలిత చాలా రోజులు కోమాలోనే ఉన్నారని… హైబిపి, షుగర్ వల్ల జయ ఆరోగ్యం మెరుగుపడలేదని చెప్పుకొచ్చారు. కొద్దిగా కోలుకుంటున్న సమయంలో గుండెపోటు వచ్చిందన్నారు. అయితే ఐసియు నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశాక ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చిందన్నారు. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు జయ పెరుగన్నం తిన్నారని తెలిపారు. వైద్యుల వివరణతో జయ మరణంపై వచ్చిన వదంతులకు పుల్‌స్టాప్ పడినట్లే.

Comments

comments